AP Govt Approve : పొగాకు రైతుల ఖాతాల్లోకి 273 కోట్ల నగదు జ‌మ

ఖుష్ క‌బ‌ర్ చెప్పిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం

Hello Telugu - AP Govt Approve

Hello Telugu - AP Govt Approve

AP Govt : అమ‌రావ‌తి – ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. రాష్ట్రంలోని పొగాకు రైతుల‌కు సంతోషం క‌లిగించేలా తాము పండించిన పంట అమ్మినందుకు గాను మొత్తం రూ. 273 కోట్ల న‌గ‌దును త‌మ ఖాతాల్లో జ‌మ చేసింది. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) వెల్ల‌డించారు. తాము ఇచ్చిన మాట ప్ర‌కారం నిధులు జ‌మ చేశామ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం రైతుల‌ను ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు.

AP Govt Approves Tobacco Farmers

పొగాకు రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండ కూడ‌ద‌ని కూట‌మి స‌ర్కార్ భావించింద‌న్నారు. ఓ వైపు రాష్ట్ర ఖ‌జానాపై పెను భారం ఉన్న‌ప్ప‌టికీ కూడా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఎట్టి ప‌రిస్థితుల్లో రైతుల‌కు ఇబ్బందులు ఉండ కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశార‌ని తెలిపారు. పొగాకు రైతుల‌కు ఎల్ల‌ప్పుడూ స‌ర్కార్ అండ‌గా ఉంటుంద‌ని చెప్పారు.

మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన నల్ల బర్లీ పొగాకుకు సంబంధించి రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. సీఎం చంద్రబాబు చొరవ, మంత్రి అచ్చెన్నాయుడు పనితనంతో రైతుల ఇంట అనందం నెల‌కొంది. ఇదిలా ఉండ‌గా సీఎం, మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు ప‌ర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబ‌శివ‌రావు, గిద్ద‌లూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. ఇదిలా ఉండ‌గా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు మంత్రి అచ్చెన్న‌. చివ‌రి పొగాకు ఆకు వ‌ర‌కు కొనుగోలు చేసి తీరుతామ‌న్నారు.

Also Read : Saketh Myneni Success :టెన్నిస్ ప్లేయ‌ర్ సాకేత్ కు గ్రూప్ -1 పోస్ట్

Exit mobile version