CM Chandrababu : అమరావతి : రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకట్టు కోవడం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు సరికొత్త ఆలోచనలకు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). ఆంధ్రప్రదేశ్‌ను భారత ఆర్థిక, సాంకేతిక ప్రగతిలో అగ్రగామిగా ప్రతిష్ఠించడమే లక్ష్యమని అన్నారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సన్నాహకాలపై సచివాలయంలో సోమవారం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సీఐఐ సదస్సుకు ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్టు సీఎం తెలిపారు. అలాగే వివిధ దేశాల వాణిజ్య మంత్రులను, లీడింగ్-గ్లోబల్ సీఈవోలను ఆహ్వానించాలని నిర్దేశించారు.
CM Chandrababu Key Update
దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, పాలసీ థింకర్లు, అకడమిక్స్‌కు సదస్సులో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. గ్లోబల్ టెక్ ట్రాన్సఫర్మేషన్, గ్లోబల్ ట్రస్ట్ పెంచుకోవడం, గ్లోబల్ ట్రేడ్‌లో దేశం వాటా పెరగడం సదస్సు లక్ష్యంగా ఉండాలని సూచించారు. అతిథులకు అన్ని సౌకర్యాలతో ఆతిథ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని, విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అలాగే గూగుల్ వంటి అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రం త్వరలోనే కృత్రిమ మేధస్సు, ఇన్నోవేషన్ హబ్‌గా మారనుందన్నారు. సదస్సులో ఈ అంశాలు రాష్ట్ర ఆకాంక్షలు ప్రతిబింబించాలే చూడాలన్నారు సీఎం.
Also Read : Harish Rao Shocking Comments : కాంగ్రెస్ ను ఓడించండి రేవంత్ కు బుద్ది చెప్పండి
