CM Chandrababu : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఇచ్చిన మాట ప్రకారం సీఆర్డీఏ భవనాన్ని పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. సోమవారం రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. భవనం మొత్తం పరిశీలించారు. అనంతరం సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ , మంత్రి నారాయణ గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ , ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు. రాజధాని విషయంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
CM Chandrababu Key Update on CRDA
ఇవాళ ఎవరూ ఊహించని రీతిలో సీఆర్డీఏ కార్యాలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందన్నారు సీఎం. ఈ సందర్బంగా రాజధాని రైతుల సమస్యల పరిష్కార బాధ్యతలు నేతలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించే బాధ్యతను వీరు చూసుకుంటారని చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌లకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారని, వారిని కలవాలని సూచించారు. రైతులతో తరచుగా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు సీఎం.
Also Read : MP Sanjay Raut Shocking Comments : పటేల్ ప్రధానిగా వుంటే ఆర్ఎస్ఎస్ ఉండేది కాదు

















