AP Cabinet : అమరావతి – ఏపీ కేబినెట్ కీలక అంశాలపై చర్చించింది. సంచలన నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy) వెల్లడించారు. ఏపీ క్యాపిటల్ రీజియన్ ఫార్ములేషన్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 40 టౌన్ ప్లానింగ్ పోస్టులకు పచ్చ జెండా ఊపింది.
AP Cabinet Strong Decisions
ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IIULER)కు భూమి కేటాయింపు ధరను నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధిలో రూ.447 లక్షల అంచనా వ్యయంతో 7 కొత్త అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపిందన్నారు. టెన్నిస్ ప్లేయర్ శ్రీ సాకేత్ సాయి మైనేనికి డిప్యూటీ కలెక్టర్ (గ్రూప్ -1) జాబ్ ఇచ్చేందుకు ఓకే చెప్పింది.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో స్వర్ణ రోడ్ మ్యాప్ టు కుప్పం 2029 కింద గుడిపాల, శాంతిపురం, కుప్పం మండల్లాలో 51 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మరమ్మత్తులు, పునరుద్ధరణ పనులకు మొత్తం రూ.1422.15 లక్షలకు పరిపాలనా ఆమోదం తెలిపిందన్నారు మంత్రి పార్థసారథి. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ , శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన రెండు పనులకు రూ. 350 కోట్లకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
Also Read : Deputy CM Bhatti Interesting : సంక్షేమ పథకాలకు రూ. 95 వేల కోట్లు – భట్టి
