PVN Madhav : అమరావతి : అమరావతిలో విశ్వకర్మ విగ్రహం ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ ను డిమాండ్ చేశారు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అనేక సమస్యలను చర్చించారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజున నిర్వహించే బిజెపి ఖాదీ సంతకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు సీఎంను. ఈ సందర్బంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పూర్తి, సృష్టి సభల తీర్మానాలకు సంబంధించిన అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు పీవీఎన్ మాధవ్ (PVN Madhav), స్టేట్ ఆర్గనైజేషనల్ సెక్రటరీ మధుకర్ . తాను తప్పకుండా వస్తానని సీఎం హామీ ఇచ్చారు.
AP BJP Chief PVN Madhav Key Comments
సంచార జాతులతో పాటు విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్ డి ఎ ప్రభుత్వంగా పరిష్కరించాల్సిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించారు. ఈ నేపధ్యంలో విశ్వకర్మ విగ్రహాన్ని రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఖాదీ సంత కార్యక్రమం గురించి చంద్రబాబు కు వివరించారు .ఖాదీ ఉత్పత్తులు ప్రదర్శన, కొనుగోలు కు భారీ ప్రచారం కల్పిస్తూ ప్రత్యేకంగా గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ సంత లు ఏర్పాటు చేస్తున్న వివరాలు వివరించారు.
Also Read : KTR Fired on Congress Govt : గిగ్ ప్లాట్ ఫారమ్ వర్కర్స్ పై వివక్ష తగదు
విజయవాడ లో జరిగే ఖాదీ సంతకు ముఖ్య అతిథి గా హాజరు కావాలని మాధవ్ ముఖ్య మంత్రి కి ఆహ్వాన పత్రిక ను అందజేశారు. నరేంద్ర మోడీ మొదటగా అమరావతి రాజధాని కోసం భూమి పూజ చేసిన స్థలాన్ని 10 ఎకరాలుగా విస్తరించి 100 అడుగుల విశ్వకర్మ విగ్రహం ఏర్పాటుతో విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరారు.
Also Read : AP Disaster Management Warning : అల్పపీడనం జర భద్రం : ప్రఖర్ జైన్
