AP BJP Chief Madhav Sensational Comments : బీజేపీ నామ్ కే వాస్తే న‌డిపేదంతా టీడీపీనే

ఏపీ బీజేపీ చీఫ్ మాధ‌వ్ సంచ‌ల‌న కామెంట్స్

Hello Telugu - AP BJP Chief Madhav Sensational Comments

Hello Telugu - AP BJP Chief Madhav Sensational Comments

AP BJP Chief Madhav : అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు మాధ‌వ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఆదివారం జ‌రిగిన బీజేపీ కార్య‌క‌ర్త‌ల కీల‌క స‌మావేశంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. రాష్ట్రంలో కొలువు తీరిన కూట‌మి ప్ర‌భుత్వంలో మ‌నం కేవ‌లం భాగ‌స్వామిగా మాత్ర‌మే ప‌రిగ‌ణించ బ‌డుతున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్బంగా నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని తెలుగుదేశం పార్టీపై సంచ‌చ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. కేవ‌లం బీజేపీ పార్ట్ న‌ర్ గా ట్రీట్ చేస్తున్నార‌ని స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌న్నారు.

AP BJP Chief Madhav Sensational Comments

బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున శ్ర‌మ‌కు ఓర్చి క‌ష్ట ప‌డ్డార‌ని, వారి ఫ‌లితం కార‌ణంగానే ఇవాళ కూట‌మి స‌ర్కార్ కొలువు తీరింద‌ని ఆవిష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు రాష్ట్ర అధ్య‌క్షుడు మాధ‌వ్ (AP BJP Chief Madhav). విచిత్రం ఏమిటంటే అంటు జాతీయ స్థాయిలో కేంద్రంలో కొలువు తీరినా ప‌లు రాష్ట్రాల‌లో కాషాయ జెండా రెప రెప లాడుతున్నా ఏపీలో మాత్రం తూతూ మంత్రంగానే కొన‌సాగుతోందంటూ వాపోయారు. ఇంకో అడుగు ముందుకేసి ఏపీని న‌డిపిస్తున్నదంతా టీడీపీనే అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు .కూటమిలో బీజేపీ భాగస్వామి మాత్ర‌మేన‌ని, ప్రభుత్వం నిర్వహించేది మాత్రం టీడీపీనంటూ పేర్కొన్నారు.

బీజేపీ జెండా ఎగరేయ్యాలనే తపనతో పనిచేసిన కార్యకర్తల వల్లే నేడు బీజేపీ అధికారంలో ఉంద‌న్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో స‌త్తా చాటాలంటూ పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు మాధ‌వ్.

Also Read : PM Kisan Interesting Update : ఎట్టకేలకు పీఎం కిసాన్ పై కీలక అప్డేట్ ఇచ్చిన కేంద్ర సర్కార్

Exit mobile version