AP BJP Chief Madhav – Farming Growth : వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు కేంద్రం పెద్ద‌పీట

స్ప‌ష్టం చేసిన ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధ‌వ్

Hello Telugu - AP BJP Chief Madhav - Farming Growth

Hello Telugu - AP BJP Chief Madhav - Farming Growth

AP BJP Chief Madhav : అమ‌రావ‌తి – ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధ‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హేలాపురి లో ఛాయ్ పే చర్చ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. కీలక అంశాలపై ప్రస్తావించారు. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ అనుసంధానం తో వైద్య సేవలు అందుబాటులో కి వస్తాయని చెప్పారు. త్వరలో వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేస్తుందన్నారు. ప్రపంచంలో నే జూట్ ఉత్పత్తులు ప్రమాదం లో ఉన్నాయన్నారు. ఏలూరు జూట్ పరిశ్రమ మూత పడడం పై మాధవ్ (AP BJP Chief Madhav) స్పందించారు. జూట్ పరిశ్రమ ను ఆదుకోవాలి అంటే ప్లాస్టిక్ మిక్స్ డ్ ఉత్పత్తులు వల్ల సాంప్రదాయ జూట్ పరిశ్రమ కు నష్టాలు వచ్చాయ‌న్నారు.

AP BJP Chief Madhav Key Comments

కేంద్ర ప్రభుత్వం వ్యసాయ ఉత్పత్తులు కు పెద్దపీట వేస్తుందన్నారు పీవీఎన్ మాధ‌వ్. రైస్ నుండి తారు విటమిన్ తయారీకి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న విషయం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్య మంత్రి చంద్రబాబు కు స్వయంగా చెబితే ముఖ్య మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేసి ఆదిశగా ఆలోచన చేస్తామని చెప్పారని మాధవ్ వివరించారు .పామాయిల్, కోకో, కొబ్బరి రైతులను ఆదుకుంటామ‌న్నారు బీజేపీ చీఫ్‌. ఏలూరు నిమ్మ మార్కెట్ కి ప్రసిద్ధి చెందింద‌ని, అందుకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. సూక్ష్మ ఆహారశుద్ధి పరిశ్రమలకు కేంద్రం సహకారం అందిస్తోందన్నారు.

ప్రొఫెషనల్ కోర్సులు చేసిన యువత నిరుద్యోగులు గా మారడం ఆందోళన కలిగిస్తోందన్నారు పీవీఎన్ మాధ‌వ్. అందుకే కేంద్రం స్కిల్ యూనివర్సిటీ లను తీసుకుని వచ్చింద‌ని చెప్పారు. ప్రధానమంత్రి కౌశల్య యోజన పేరు తో 18 వృత్తుల‌కు శిక్షణ ఇవ్వడం జరుగుతోంద‌న్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా యువతకు అవకాశాలు క‌ల్పిస్తున్నామ‌న్నారు. విశాఖ లో ఒక స్కిల్ యూనివర్సిటీ ఇప్ప‌టికే ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

Also Read : Koil Alwar Tirumanjanam Interesting : ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Exit mobile version