కడప జిల్లా : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం నైపుణ్య అభివృద్ది ( స్కిల్ డెవపల్మెంట్) పై ఎక్కువగా దృష్టి సారిస్తోందని చెప్పారు. వైఎస్సార్ కడప జిల్లాలోని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని మరింత ఆదర్శ వంతంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఇప్పటికే పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామన్నారు. రాబోయే రోజుల్లో కుప్పం ఓ రోల్ మోడల్ గా మారనుందన్నారు. ఈ సందర్బంగా కుప్పంలో ఏపీహెచ్ సీ ఎంఎంస్ఈ పార్కును ప్రారంభించారు. గుడిపల్లె మండలం పొగురుపల్లెలో 44.58 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు కావడం ఆనందంగా ఉందన్నారు. ఇందులో 167 పారిశ్రామిక ప్లాట్లతో సిద్ధమైందని వెల్లడించారు సీఎం.
ఈ నెల నుంచి పారిశ్రామికవేత్తలకు ప్లాట్లు కేటాయించాలని సీఎం ఆదేశించారు .కుప్పంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఒకే వేదిక మీదకు ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకు రానుందని స్పష్టం చేశారు . ఈ మేరకు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు. కుప్పానికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాదని ప్రకటించారు. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత ప్రజలదని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు. పరిశ్రమలు, సేవా, వ్యవసాయ రంగాల్లో కుప్పాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. పులివెందులలో లింగాల మండలాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మండలంలో ఉద్యాన పంటలపై ఫోకస్ పెట్టాం అన్నారు. అక్కడి ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకున్నారని, ఇప్పుడు వారి తలసరి ఆదాయం రూ. 7.30 లక్షలకు చెేరిందన్నారు.
