AP : అమరావతి – ఆంధ్రప్రదేశ్ (AP) సర్కార్ కొత్తగా రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఏకంగా రాష్ట్రంలో అర్హులైన పేదలు 4.42 కోట్ల మందికి రేషన్ కార్డులను పంపిణీ చేసింది ఒకేరోజు. ఇందులో భాగంగా ఈసారి కూటమి సర్కార్ ఏటీఎం తరహా కార్డులను తయారు చేసినట్లు ప్రకటించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రతి చోటా కోలాహలం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పెనమలూరులో జరిగిన కార్యక్రమంలో అర్హులైన కుటుంబాలకు కార్డులను అందజేశారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఇంటింటికీ డెలివరీ చేయడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఇది నొక్కి చెబుతుందని ఆయన అన్నారు.
AP New Ration Cards
రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుండి అయినా పౌరులు రేషన్ సామాగ్రిని పొందేందుకు వీలు కల్పిస్తుందని మనోహర్ చెప్పారు. కొత్త స్మార్ట్ కార్డులు అందుకుంటున్న వారిలో ఎన్టీఆర్ జిల్లాలో 5.90 లక్షల మంది, కృష్ణ జిల్లాలో 5.17 లక్షల మంది ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15 నాటికి ఇంటింటికీ పంపిణీని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు. స్మార్ట్ కార్డ్ వ్యవస్థ పారదర్శకతను పెంపొందించడానికి రూపొందించడం జరిగిందన్నారు. క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా, లబ్ధిదారుడు తమ రేషన్ సామాగ్రిని ఎప్పుడు తీసుకున్నారనే వివరాలను అధికారులు తక్షణమే పొందవచ్చని చెప్పారు.
Also Read : Women Employment Growth : పెరిగిన మహిళల ఉపాధి రేటు
