‘బిగ్ బాస్’ తెలుగు రియాల్టీ షోపై ఉత్కంఠ

చెన్నై ల‌వ్ స్టోరీ నుడు కూడా పాల్గొంటాడా

helloteugu-BigBoss10

హైద‌రాబాద్ : తెలుగు బుల్లితెర‌పై అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన రియాల్టీ షోగా గుర్తింపు పొందింది బిగ్ బాస్ తెలుగు. ప్ర‌స్తుతం 10వ సీజ‌న్ . ఈసారి కూడా ప్ర‌ముఖ న‌టుడు, యాంక‌ర్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ ప్రోగ్రాంపై ఉత్కంఠ నెల‌కొంది. తాజాగా కీల‌క అప్ డేట్ వ‌చ్చింది ఈ షో గురించి.
ఇదిలా ఉండ‌గా ‘చెన్నై లవ్ స్టోరీ’ నటుడు అడిత్ అరుణ్ పాల్గొనబోతున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. గత సీజన్ల మాదిరిగానే అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండ‌డంతో పెద్ద ఎత్తున అంచ‌నాలు పెరిగాయి. అటు న‌టుడిగా సినిమాల‌లో న‌టిస్తూనే మ‌రో వైపు యాంక‌రింగ్ లో కూడా త‌న‌దైన ముద్ర పోషిస్తున్నారు. మ‌రో వైపు సోషల్ మీడియాలో బిగ్ బాస్ షో గురించి ప్రోమో విడుదలైనప్పటి నుంచే బిగ్ బాస్ తెలుగు 10 కోసం అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

తాజాగా ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియకు ప్రియుడిగా కనిపించిన నటుడు అడిత్ అరుణ్, రాబోయే సీజన్‌లో పాల్గొనే పోటీదారులలో ఒకరిగా పరిశీలించ బడుతున్నారు. డ‌బ్ల్యూడ‌బ్ల్యూడ‌బ్ల్యూ’, ‘ప్రేమదేశం’, ‘ఈష’, ‘మనమే’ వంటి చిత్రాలలో ఆయన ప్రధాన లేదా సహాయ పాత్రలు పోషించారు. అడిత్ అరుణ్‌ను ‘త్రిగుణ్’ అని కూడా పిలుస్తారు. ‘చీకటి గదిలో చితక్కొట్టుడుస‌, పీఎస్వీ గరుడ వేగ‌ వంటి సినిమాల తర్వాత ఆయన పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ రియాలిటీ షోలో ఆయన పాల్గొంటే ఖచ్చితంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తారని భావిస్తున్నారు. ఈ షో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని అంచనా, అయితే నిర్వాహకులు ఇంకా అధికారిక ప్రారంభ తేదీని ప్రకటించలేదు. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా తిరిగి రానున్నారు. ఈ షో ‘స్టార్ మా’ లో ప్రసారం కానుంది.

Exit mobile version