Air India Plane Shocking : గుండెల్లో గుబులు పుట్టించిన మరో ‘ఎయిర్ ఇండియా’ విమానం

లండన్‌కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం 3 గంటల పాటు గాల్లోనే ఉండి తిరిగి వెనక్కి వెళ్లింది...

Hello Telugu - Air India Plane Shocking

Hello Telugu - Air India Plane Shocking

Air India : అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదం అందర్నీ కలచివేసింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం అనూహ్యంగా కుప్పకూలడం, అందులోని 242 మంది ప్రాణాలు కోల్పోవడంపై అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపాణీ కూడా ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. ఈ ఘోర ప్రమాదం గురించి అంతా మాట్లాడుకుంటున్న సమయంలోనే మరో ఎయిరిండియా విమానం గుబులు పుట్టించింది. అది కూడా లండన్‌కు వెళ్తున్న ఫ్లైటే కావడం గమనార్హం. లండన్‌కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం 3 గంటల పాటు గాల్లోనే ఉండి తిరిగి వెనక్కి వెళ్లింది.

Air India Plane 3hrs in Air

ముంబై నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిరిండియా (Air India) ఏఐసీ129 విమానం కొన్ని గంటలకే వెనక్కి మళ్లింది. శుక్రవారం ఉదయం 5.39 గంటలకు ఈ ఫ్లైట్ టేకాఫ్ అయింది. అయితే 3 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి తిరిగి ముంబైకి చేరుకుంది. లండన్‌కు వెళ్లాల్సిన విమానాన్ని తిరిగి వెనక్కి మళ్లించడానికి గల కారణాలు ఏంటనేది ఇంకా స్పష్టత లేదు. అయితే ఇజ్రాయెల్-ఇరాన్ నడుమ ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ విమానాన్ని వెనక్కి మళ్లించారని సమాచారం. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పశ్చిమాసియాలో పలు చోట్ల గగనతలాల మీద ఆంక్షలు విధించారు. ఇదే కారణంతో ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాలను దారి మళ్లిస్తున్నారు. అలాగే పలు విమాన సర్వీసులను రద్దు కూడా చేసేశారు. ఈ క్రమంలోనే ఎయిరిండియా విమానాన్ని వెనక్కి మళ్లించారని వినిపిస్తోంది.

Also Read : Nayanthara Sensational : మరో సరికొత్త రోల్ లో అలరించనున్న లేడీ సూపర్ స్టార్

Exit mobile version