TTD : అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం కీలక ప్రకటన చేశారు. ఎవరూ ఊహించని రీతిలో సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ కు కీలకమైన బాధ్యతలను మరోసారి అప్పగించారు. తన పనితీరును గుర్తించిన సీఎం అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కూడా అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ (TTD) ఈవోగా విశిష్ట సేవలు అందించారు. ఆయన కీలకమైన మార్పులు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.
TTD New EO Anil Kumar Singhal
గతంలో కూడా ఆయన చాలాకాలం టీటీడీ ఈవో గా సేవలందించారు. ఆలయానికి పేరు తీసుకు వచ్చారు. తనను ఆనాడు సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఏరికోరి నియమించారు. .టీటీడీ ఈవో గా తొలిసారి 2017 లో నియమించింది.. అయితే తెలుగు వాడికి కాకుండా ఉత్తరాదికి చెందిన అధికారిని ఈవో గా నియమించారని విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు. తనకే బాధ్యతలు అప్పగించారు. మూడు సంవత్సరాల పాటు ఈవోగా రేయింబవళ్లు శ్రమించారు. తన పనితీరుతో ఆకట్టుకున్నారు సింఘాల్. తన నిజాయితీతో మూడేళ్లలో మంచి పేరు తెచ్చుకున్నారు. 2020 లో ఆయనను టీటీడీ నుండి బదిలీ చేశారు. మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వ హయంలోనే సింఘాల్ ను తిరిగి టీటీడీ ఈవో గా నియమించడం విశేషంగానే భావించాలి..
ఇదిలా ఉండగా టీటీడీ ప్రక్షాళనపై దృష్టి పెట్టిన ప్రభుత్వం అందులో భాగంగానే సింఘాల్ ను మళ్లీ ఈవో గా నియమించినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : SCR Important Update : ప్రయాణికులకు అదిరిపోయే వార్త చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే















