సింగ‌రేణి స్కాంపై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాలి

కేంద్ర స‌ర్కార్ ను డిమాండ్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్

hellotelugu-KTR

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక స్కాములకే కాంగ్రెస్ పాలన పరిమితమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో స్కీములు మాయమై స్కాములు మాత్రమే మిగిలాయన్నారు. సింగరేణి స్కామ్‌ పైన మంత్రులు తేలు కుట్టిన దొంగల్లా కనీసం మాట్లాడడం లేద‌న్నారు. ఒక్కో మంత్రి ఒక్కో దేశం పారిపోయాడని ధ్వ‌జ‌మెత్తారు. ఈ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఈ మొత్తం వ్యవహారానికి రాజకీయ బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు కేటీఆర్.

సింగరేణిలో దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయిలో భారీ దోపిడీ జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కోల్ బెల్ట్ నుంచి వచ్చిన ప్రజలు ఈ మోసాన్ని తప్పక గుర్తించాలని, సింగరేణి అంశమే కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని బయట పెడుతోందని స్పష్టం చేశారు. ఈ అంశంపైన మొత్తం మంత్రులు తేలు కుట్టిన దొంగల్లా కనీసం మాట్లాడడం లేదని కేటీఆర్ ఆరోపించారు. ఈ స్కాం బయటపడగానే కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క ఒకరిని మించి ఒకరు నటించారని, అయితే వారి మాటల మోసాలు స్కామ్‌ను దాచి ఉంచలేవన్నారు.

కేసీఆర్ పాలనలో నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తీసుకొచ్చామని, కార్మికులకు ఇచ్చిన 10 హామీల్లో 9 హామీలు అమలు చేశామని గుర్తు చేశారు . కానీ కాంగ్రెస్ వచ్చాక కొత్త నిబంధనల పేరుతో సింగరేణిని దోచుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ అనే కొత్త నిబంధన తీసుకువచ్చి టెండర్లను కట్టడి చేసిందని విమర్శించారు. గతంలో దేశంలో ఎక్కడున్న కాంట్రాక్టర్ అయినా ఈ-టెండర్ ద్వారా పోటీ పడే అవకాశం ఉండగా, ఇప్పుడు తప్పనిసరిగా సైట్‌కు వచ్చి సర్టిఫికేట్ తీసుకోవాల్సిందేనని చెప్పి అవినీతికి తలుపులు తెరిచారని ఆరోపించారు

Exit mobile version