చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. ఆయన కేంద్ర సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను టార్గెట్ చేశారు. దమ్ముంటే తమిళనాడుకు రావాలని సవాల్ విసిరారు. అంతే కాదు ఆరు నూరైనా సరే, ఎన్ని జిమ్మిక్కులు చేసినా సరే తన ప్లాన్స్ వర్కవుట్ కాదన్నారు. చెన్నై వేదికగా జరిగిన డీఎంకే యువజన సదస్సులో ప్రసంగించారు ఎంకే స్టాలిన్. ఈ సంధర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అమిత్ షాను ఏకి పారేశాడు. దేశంలో బీజేపీ ఒక్కటే ఉండాలని అనుకుంటోందని, కానీ అది చెల్లుబాటు కాదన్నారు సీఎం.
బీహార్ లో అక్రమంగా ఓట్ల చోరీకి పాల్పడి గెలిచిన బీజేపీ ఎన్డీయేకు అంత సీన్ లేదన్నారు. తమిళనాడు ఎన్నటికీ బీహార్ కాదన్నారు. అది గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సరే
బీజేపీ ఈ రాష్ట్రంలో తన ఉనికిని చాటుకోలేదని అన్నారు. ఇటీవల బీహార్ విజయం తర్వాత తమ తదుపరి లక్ష్యం తమిళనాడు అని అమిత్ షా అన్నారని ఎం.కె. స్టాలిన్ పేర్కొన్నారు. అమిత్ షానే కాదు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినా, తమ పరివారం గంగగుత్తగా తమిళనాడుకు వచ్చినా, పోటీ చేసినా సరే డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు స్టాలిన్.
