Amit Kalyan : అమరావతి : భారత్ ఫోర్జ్ లిమిటెడ్ వైస్ చైర్మన్ , జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ కళ్యాణితో (Amit Kalyan) భేటీ అయ్యారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా ఇరువురు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో పర్యాటకం, నౌకా నిర్మాణం, ఎలక్ట్రానిక్స్ , తదితర రంగాలలో పెట్టుబడి అవకాశాల గురించి ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుతం ఏపీ సర్కార్, సీఐఐ సదస్సు ను ప్రతిష్టాత్మకంగా ఈనెల 14, 15వ తేదీలలో రెండు రోజుల పాటు విశాఖ నగరం వేదికగా నిర్వహిస్తోంది. యావత్ ప్రపంచంలోని ప్రధాన కంపెనీలు, సంస్థలు, సీఈఓలు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు, కన్సల్టెంట్స్, పెట్టుబడిదారులు హాజరవుతున్నారు.
Amit Kalyan Meet CM Chandrababu
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో దీనిని చేపట్టేందుకు సిద్దమైంది సర్కార్. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా మంత్రులు, ఉన్నతాధికారులకు ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న సదస్సు 30వది కావడం విశేషం. ప్రభుత్వం దీని ద్వారా ఏకంగా రూ. 10 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు చేసుకోవచ్చని భావిస్తోంది. ఇందులో భాగంగా అమిత్ కళ్యాణితో భేటీ అయ్యారు.
Also Read : AP CII Summit Important Updates : రేపే 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
