CII Summit : విశాఖపట్నం : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహించనున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖ నగరం ముస్తాబైంది. ఈనెల 14, 15వ తేదీలలో రెండు రోజుల పాటు ఇది జరుగుతుంది. సీఐఐ (CII Summit)- ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. పార్టనర్షిప్ సమ్మిట్ కు ముందుగా ఇవాళ దేశంలోని ప్రముఖ కంపెనీల చైర్మన్లు, సీఈఓలు, విదేశీ రాయబారులతో భేటీ కానున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో వివిధ కంపెనీలతో ఎంఓయూలు చేసుకోనుంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి రానున్నాయని అంచనా వేస్తోంది ఏపీ కూటమి సర్కార్.
AP CII Summit Updates
ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు నోవోటెల్ హోటల్ లో ఇండియా -యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియా – యూరోప్ కోపరేషన్ ఫర్ సస్టెయినబుల్ గ్రోత్ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో గ్రీన్ షిఫ్ట్, సస్టైనబుల్ ఇన్నోవేషన్, యూరోపియన్ పెట్టుబడులపై పారిశ్రామిక ప్రతినిధులతో చర్చలు జరుపుతారు ముఖ్యమంత్రి. మధ్యాహ్నం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఎస్పీపీ పంప్స్ లిమిటెడ్ ఎండీ అలోక్ కిర్లోస్కర్, రెన్యూ పవర్ చైర్మన్ సుమిత్ సిన్హా, యాక్షన్ టెసా గ్రూప్ చైర్మన్ ఎన్ కె అగర్వాల్ తో సమావేశం అవుతారు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే సదస్సుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : TWJF Shocking Decision : టీడబ్ల్యూజేఎఫ్ సంచలన నిర్ణయం
