Aloe Vera Juice Shocking Facts : మీరు అతిగా అలోవెరా జ్యూస్ తాగుతున్నారా..అయితే జాగ్రత్త

జాగ్రత్తలు పాటించకపోతే మేలు కన్నా నష్టం జరుగుతుందనే సూచనలూ కనిపిస్తున్నాయి...

Hello Telugu - Aloe Vera Juice Shocking Facts

Hello Telugu - Aloe Vera Juice Shocking Facts

Aloe Vera Juice : పరగడుపున కలబంద రసం (Aloe Vera Juice) తాగడం ఆరోగ్యానికి అనేక రకాల లాభాలు కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ప్రాచీన కాలం నుంచి సంస్కృతిలో కలబందను ఔషధంగా వినియోగిస్తున్నారు. అయితే, దీన్ని వినియోగించే విధానం, పరిమాణం, ఎవరు తీసుకోవాలో అనే అంశాల్లో జాగ్రత్తలు పాటించకపోతే మేలు కన్నా నష్టం జరుగుతుందనే సూచనలూ కనిపిస్తున్నాయి.

Aloe Vera Juice – పోషకాల నిలయం కలబంద రసం

కలబంద రసంలో విటమిన్లు ఎ, సి, ఈ, బి-కాంప్లెక్స్ వంటి ముఖ్యమైన విటమిన్లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియంలాంటి ఖనిజాలూ పుష్కలంగా ఉంటాయి. పరగడుపున కలబంద రసం తీసుకుంటే శరీరానికి ఇవన్నీ సమర్థంగా అందుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

జీర్ణ వ్యవస్థకు మేలు

కలబంద రసం జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే సహజ ఎంజైములు ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి. ఇది యాసిడ్ రిఫ్లక్స్, మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలకు ఉపశమనంగా పనిచేస్తుంది. జీర్ణతంత్రాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు ఆరోగ్యాన్ని పటిష్టం చేస్తుంది.

శరీర డిటాక్సిఫికేషన్‌లో సహాయకారి

పరగడుపున కలబంద రసం తాగడం ద్వారా శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. కాలేయం శుభ్రపడి, శరీరం శక్తివంతంగా మారుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

పొటాషియం లోపానికి ముప్పు

అయితే కలబంద రసాన్ని అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా కలగొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో పొటాషియం స్థాయి తగ్గి, గుండె ధడ బలహీనమయ్యే ప్రమాదం ఉంది. దీని వల్ల గుండె వేగంగా కొట్టుకోవడం లేదా ఆగిపోవడం వంటి ప్రమాదాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు.

గర్భిణీ స్త్రీలు, బాలింతలు దూరంగా ఉండాలి

గర్భిణీ స్త్రీలు, బాలింతలు కలబంద రసాన్ని వినియోగించకూడదని నిపుణులు స్పష్టంగా సూచిస్తున్నారు. దీనివల్ల గర్భంలో శిశువుకు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు అబార్షన్‌కు దారితీసే అవకాశమూ ఉండే అవకాశం ఉందని వైద్యుల హెచ్చరిక.

Also Read : Varalakshmi Vratam Interesting Facts : వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటో మీకు తెలుసా?

Exit mobile version