Aloe Vera : అలోవేరా అనేది సహజ ఔషధ గుణాలు ఉన్న ఔషధ మొక్క. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు మరియు షుగర్ (డయాబెటిస్) రోగులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Aloe Vera Benefits
జిడ్డు చర్మంతో బాధపడే వారు, అలోవీరా (Aloe Vera) ఆకులను నీళ్లలో మరిగించి, ఆ మిశ్రమాన్ని పేస్ట్‌లా తయారుచేసి ఫేస్‌మాస్క్‌లా ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని శుభ్రపరిచి, మృదువుగా మార్చుతుంది. ముఖంలో ట్యాన్ సమస్య తగ్గించేందుకు కూడా అలోవేరా సమర్థంగా పనిచేస్తుంది. అలోవెరా గుజ్జులో నిమ్మరసం, పసుపు కలిపి మిశ్రమంగా ఉపయోగిస్తే ట్యాన్ తగ్గుతుంది.
అలోవెరాను నేరుగా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. కొన్ని పరిశోధనలు ప్రకారం, అలోవేరా జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీనిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. పేగులలో పేరుకుపోయిన చెడు పదార్థాలు, కొవ్వు, ఆయిల్ లాంటి హానికర పదార్థాలను తొలగిస్తుంది.
ఉత్తి జ్యూస్ తాగలేని వారు, అందులో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలిపి తాగవచ్చు. ఇది రుచికి అనువుగా మారుతుంది.
గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో అలోవేరా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఆంత్రాక్వినోన్స్ అనే సమ్మేళనాలు మలబద్ధకానికి సహజ చికిత్సగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలోవెరా గుజ్జును కొబ్బరి నూనెలో కలిపి తలకు పట్టిస్తే జుట్టు రిపేర్ అవుతుంది, చుండ్రు తగ్గుతుంది, తలపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. ఫలితంగా జుట్టు మెరుస్తూ, స్మూత్‌గా మారుతుంది. జుట్టు రాలిపోతున్నవారు ఇలా చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడింది. ఆరోగ్య సమస్యలున్న వారికి వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Also Read : Amla Interesting Benefits : ఏంటి రోజూ ఉసిరి రసం తాగితే ఇన్ని ఉపయోగాలా..
