Hero Allu Arjun Atlee Movie : ‘అట్లీ బ‌న్నీ’ మూవీకి సాయి అభ్యాంక‌ర్ మ్యూజిక్

క‌న్ ఫ‌ర్మ్ చేసిన పాన్ ఇండియా స్టార్ హీరో

Hello Telugu - Hero Allu Arjun Atlee Movie

Hello Telugu - Hero Allu Arjun Atlee Movie

Allu Arjun : హైద‌రాబాద్ : భార‌త దేశంలోనే అత్యంత పాపుల‌ర్ యాక్ట‌ర్ గా పేరు పొందాడు అల్లు అర్జున్ (Allu Arjun). త‌ను ప్ర‌స్తుతం డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. ఈ ఇద్ద‌రికీ క‌లిపి దేశంలో ఇంత వ‌ర‌కు ఏ డైరెక్ట‌ర్, న‌టుడికి ఇవ్వ‌నంత పారితోష‌కం ఇస్తున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఈ ఇద్ద‌రికీ క‌లిపి నిర్మాణ సంస్థ ఏకంగా రూ. 300 కోట్ల‌కు పైగానే చెల్లించిన‌ట్లు టాక్. దీనిని అట్లీ కానీ న‌టుడు బ‌న్నీ కాని ఖండించ‌క పోవ‌డం విశేషం. ఇది ప‌క్క‌న పెడితే ఈ ఇద్ద‌రి కాంబోలో వ‌స్తున్న మూవీ పై పెద్ద ఎత్తున అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌స్తుతం హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా క‌న్ ఫ‌ర్మ్ చేయ‌లేదు. అంద‌రూ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ లేదా అనిరుధ్ ర‌విచంద్ర‌న్ అనుకున్నారు. గ‌తంలో అట్లీ చేసిన మూవీస్ కు రాక్ స్టార్ మ్యూజిక్ అందించాడు. కానీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో కొత్త పేరు తెర‌పైకి వ‌చ్చింది.

Allu Arjun – Atlee Movie Music Director

ఈ విష‌యాన్ని స్వ‌యంగా స్టార్ హీరో అల్లు అర్జున్ చెప్ప‌డం మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు యంగ్ ట‌ర్క్ గా పేరు పొందిన సాయి అభ్యాంక‌ర్ అని పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరో చివరకు ధృవీకరించారు. తాత్కాలికంగా ఏఏ22ఎక్స్ ఏ6 మూవీలో అల్లు అర్జున్ తో పాటు కీల‌క పాత్ర పోషిస్తోంది బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొనే. ఇదిలా ఉండ‌గా ఈ యువ స్వ‌ర‌క‌ర్త ఇప్ప‌టికే త‌ను సంగీతం అందించిన ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్, మ‌మ‌తా బైజు క‌లిసి న‌టించిన దుమ్ము రేపుతున్న డ్యూడ్ మూవీ చిత్రం ఉంది. ఇది ఇప్పుడు యువ‌తీ యువ‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తోంది. ఆర్య నుండి పుష్ప వ‌ర‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌గా , అల వైకుంఠ పురంలో మూవీకి ఎస్ఎస్ థ‌మ‌న్ అందిస్తే తాజాగా కొత్త మూవీకి సాయి అభ్యాంక‌ర్ మ్యూజిక్ ఇస్తున్న‌ట్లు స‌మాచారం.

Also Read : Baahubali The Eternal War Interesting : బాహుబ‌లి – ది ఎట‌ర్న‌ల్ వార్ టీజ‌ర్ రిలీజ్

Exit mobile version