Nagarjuna : హైదరాబాద్ : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 16న పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, ప్రయోక్త అక్కినేని నాగార్జున (Nagarjuna) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయనకు మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. తన 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం నటుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధానమంత్రితో తన తొలి సమావేశానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఆయన జ్ఞాపకాలతో తాను ఎలా మునిగి పోయానో, ప్రధాని మోడీ ఆయనతో పంచుకున్న ప్రత్యేక సందేశాన్ని గుర్తు చేసుకున్నారు. ఈసందర్భంగా మోదీ తన గురించి కూడా ప్రస్తావించడంతో తాను ఆశ్చర్యానికి లోనయ్యానని అన్నారు.
Nagarjuna Meet PM Modi
ఒక దేశానికి విజయవంతమైన ప్రధానిగా ఉన్నప్పటికీ దేశంలోని సినీ రంగానికి చెందిన ప్రతి ఒక్కరినీ పలకరించడం, వారితో సమావేశాలు నిర్వహించడం, వెన్నుతట్టి ప్రోత్సహించడం తనను మరింత విస్తు పోయేలా చేసిందన్నారు అక్కినేని నాగార్జున. ఈ సమయంలో తనకు చెందిన కొందరు సౌత్ ఇండియా సూపర్ స్టార్ నాగ్ ను కలుసుకున్నామని తనతో చెప్పారని ఈ విషయాన్ని ప్రత్యేకంగా మోదీ తనకు గుర్తు చేయడం జీవితంలో మరిచి పోలేనని పేర్కొన్నారు. వినయం మానవులకు చాలా ముఖ్యం. మీరు అప్పట్లో కలిగి ఉన్న సానుభూతిని ఎల్లప్పుడూ కలిగి ఉండాలని పీఎం సూచించారని, గుర్తు చేశారని తెలిపారు. తన మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి తన తండ్రి, దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని తెలిపారు. లెజెండ్ నటుడంటూ కొనియాడారని ఈ సందర్భంగా మోదీకి మరోసారి ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read : Minister Atchannaidu Fired on YS Jagan : రైతులకు మాట్లాడే హక్కు జగన్ కు లేదు
