GST Reforms-Stock Market Growth : జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల‌తో స్టాక్ మార్కెట్ జోరు

సెన్సెక్స్ 550 పాయింట్ల‌కు పైగా ర్యాలీ

Hello Telugu - GST Reforms-Stock Market Growth

Hello Telugu - GST Reforms-Stock Market Growth

Stock Market : కేంద్ర స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అధ్య‌క్ష‌త‌న వ‌స్తు సేవ‌ల ప‌న్ను విధింపు (జీఎస్టీ) కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఆయా రాష్ట్రాల‌కు సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రులు, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా గ‌తంలో నాలుగు స్లాబ్ రేట్స్ ఉండేవి. ఇప్పుడు కేవ‌లం రెండు స్లాబ్ రేట్ల‌కే ప‌రిమితం చేసింది. ఇందులో వస్తు సేవ‌ల‌కు సంబంధించి ఒక‌టి 5 శాతం రెండోది 18 శాతం స్లాట్ (Stock Market) రేట్లుగా నిర్ణ‌యించింది. కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టింది.

Stock Market Updates

జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న తాజా సంస్క‌ర‌ణ‌ల‌కు గాను ఏకంగా భార‌తీయ స్టాక్ మార్కెట్ జోరందుకుంది. సెన్సెక్స్ 550 పాయింట్ల‌కు చేరుకుంది. గురువారం భారత బెంచ్‌మార్క్ సూచీలు లాభాలతో ప్రారంభం అయ్యాయి. వివిధ రంగాలలో జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించిన పరివర్తన రేటు తగ్గింపులతో ఇది ఊపందుకుందని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఉదయం 9.25 గంట‌ల‌కు సెన్సెక్స్ 554 పాయింట్లు లేదా 0.69 శాతం పెరిగి 81,122 వద్ద చేరుకుంది. నిఫ్టీ 159 పాయింట్లు లేదా 0.64 శాతం పెరిగి 24,874 వద్ద ఉంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 0.21 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.05 శాతం పెరిగాయి. ఇదిలా ఉండ‌గా ఇళ్లు, రైతులు , పరిశ్రమలకు గణనీయమైన ఉపశమనం కలిగించేలా జీఎస్టీ కౌన్సిల్ బీమా, మందులు , రోజువారీ నిత్యావసర వస్తువులపై రేట్లను తగ్గించింది.

గతంలో 28 శాతం పన్ను విధించబడిన దాదాపు 90 శాతం వస్తువులను 18 శాతం స్లాబ్‌కు తరలించారు, 12 శాతం కేటగిరీలోని దాదాపు 99 శాతం వస్తువులు ఇప్పుడు 5 శాతం కిందకు వచ్చాయి. నిఫ్టీ ఆటో 2.51 శాతం పెరిగి అత్యధికంగా లాభపడింది, తరువాత నిఫ్టీ ఎఫ్ ఎం సీజీ 1.73 శాతం లాభపడింది. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్ , నిఫ్టీ ఫార్మా రెడ్ జోన్‌లో ట్రేడవుతున్నాయి. హెచ్ యు ఎల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ట్రెంట్ ప్రధాన లాభాలను ఆర్జించాయి. ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్ హెచ్ సీఎల్ టెక్నాలజీస్ ఉన్నాయి.

Also Read : Thalapathy Vijay Important Tour : నెలాఖ‌రు నుంచి జ‌నంలోకి ద‌ళ‌ప‌తి విజ‌య్

Exit mobile version