అఖండ తాండ‌వం క‌లెక్ష‌న్స్ అద్భుతం

రూ. 28 కోట్ల వ‌సూళ్ల‌తో దుమ్ము రేపిన మూవీ

hellotelugu-Akhana-2Collections

హైద‌రాబాద్ : ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సీక్వెల్ మూవీ అఖండ -2 తాండ‌వం ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అంచ‌నాల‌కు మించి ఉండ‌డంతో బాల‌య్య ఫ్యాన్స్ సంబురాల‌లో మునిగి పోయారు. ఇప్ప‌టికే అఖండ పార్ట్ 1 దుమ్ము రేపింది. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. దీంతో అఖండ -2 సీక్వెల్ తీశాడు. ఇది ఊహించ‌ని స‌క్సెస్ టాక్ తెచ్చుకుంది. నైజాం, సీడెడ్, ఆంధ్రా తో పాటు ఇత‌ర రాష్ట్రాల‌లో కూడా విడుద‌లై కాసుల వ‌ర్షం కురిపిస్తోంది . బాల‌య్య మ‌రోసారి త‌న న‌ట‌న‌తో విశ్వ రూపం చూపించాడు. విడుద‌లైన ప్ర‌తి చోటా పెద్ద ఎత్తున క‌లెక్షన్స్ రావ‌డం విస్తు పోయేలా చేసింది.

అఖండ 2 ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ‌లో దాదాపు రూ.80 కోట్లకు ట్రేడ్ అయింద‌ని స‌మాచారం. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఘనమైన థియేట్రికల్ రన్ అవసరం. బాలకృష్ణ. భారీ అంచనాలపై దూసుకు పోతోంది మూవీ. యాక్షన్ ఎంటర్‌టైనర్ అఖండ 2 తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసింది. ఈ చిత్రం మొదటి రోజు దాదాపు రూ.28 కోట్ల నికర వసూళ్లను సాధించింది, ఇందులో ప్రీమియర్ షోల నుండి దాదాపు రూ.8 కోట్లు ఉన్నాయి.ఇది టాలీవుడ్‌లో కొత్త బెంచ్ మార్క్‌ను నెలకొల్పింది. నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్లకు తరలివచ్చారు, బాలకృష్ణ శక్తివంతమైన స్క్రీన్ ఉనికిని, సినిమాలోని వీరోచిత క్షణాలను జరుపుకుంటున్నారు.

Exit mobile version