Air India Black Box Exclusive :ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ ఇండియాలోనే ఉంది

కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు ప్ర‌క‌ట‌న

Hello Telugu - Air India Black Box Exclusive

Hello Telugu - Air India Black Box Exclusive

Air India : ఢిల్లీ – కేంద్ర మంత్రి కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గుజ‌రాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా (Air India) విమాన ప్రమాదంలో లభ్యమైన బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు పంపిచారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై తీవ్రంగా స్పందించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇలాంటి నిరాధార‌మైన వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. దీని వ‌ల్ల ప్ర‌జ‌ల్లో అపోహ‌లు క‌లిగే ప్ర‌మాదం ఉంద‌న్నారు. ద‌య‌చేసి ఏదైనా స‌మాచారం కావాల‌ని అనుకుంటే కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు రామ్మోహ‌న్ నాయుడు.

Air India Black Box Exclusive Update

అవన్నీ ఊహాగానాలేనంటూ కొట్టి పారేశారు. బ్లాక్‌బాక్స్ భారత్‌లోనే ఉందని స్ప‌ష్టం చేశారు. బ్లాక్‌బాక్స్‌ను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పరిశీలిస్తోందని అన్నారు. ఇది చాలా సాంకేతికతతో కూడిన వ్యవహారం కావడంతో కొంత సమయం పడుతుందన్నారు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu). ఇదిలా ఉండ‌గా అహ్మ‌దాబాద్ నుంచి లండ‌న్ కు బ‌య‌లు దేరాల్సిన విమానం టేకాఫ్ అయిన కొన్ని క్ష‌ణాల్లోనే కూలి పోయింది. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌యాణిస్తున్న 239 మందితో పాటు బీజే ఆస్ప‌త్రి క్వార్ట‌ర్స్ లో ఉన్న 39 మంది వైద్యులు, 12 మంది విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘ‌ట‌న ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపేలా చేసింది. దీనిపై ఎయిర్ ఇండియా యాజ‌మాన్యం టాటా గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌రన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. చ‌ని పోయిన కుటుంబాల‌కు ప‌రిహారం కింద రూ. 1 కోటి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అటు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా సాయం ప్ర‌క‌టించాయి. ఇదే స‌మ‌యంలో గుజ‌రాత్ మాజీ సీఎం విజ‌య్ రూపాణి సైతం ఈ విమాన ప్ర‌మాదంలో మృతి చెందారు.

Also Read : Best Tourist Places : మీరు మీ ప్రేయసితో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా అయితే ఇది చూడండి

Exit mobile version