AIADMK : చెన్నై : తమిళనాడులో రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి. రోజు రోజుకు సమీకరణలు కూడా మార బోతున్నాయి. నిన్నటి దాకా ఉప్పు నిప్పు లాగా ఉన్న అన్నాడీఎంకే (AIADMK), బీజేపీలతో ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ కూడా జత కట్టబోతోందా అన్న అనుమానం తెర పైకి వచ్చింది. విచిత్రం ఏమిటంటే తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే ప్రచారంలో నటుడు విజయ్ టీవీకే జెండాలు పెద్ద ఎత్తున కనిపించాయి. ఇదే సమయంలో ఉన్నట్టుండి అన్నాడీఎంకే పార్టీ చీఫ్ పళనిస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పరోక్షంగా పొత్తుపై సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి. ఈసారి ఎలాగైనా సరే తమిళనాడులో పవర్ లోకి రావాలని కంకణం కట్టుకున్నారు.
AIADMK Party Key Comments
ఇక దక్షిణాదిన బీజేపీ చేసిన ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రావడం లేదు. దూకుడు మీద ఉన్న పార్టీ అధ్యక్షుడు అన్నామలైని సైలెంట్ గా తప్పించేసింది బీజేపీ హైకమాండ్. ఇప్పుడు లోపాయికారిగా విజయ్ తో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. తాజాగా టీవీకే విజయ్ కరూర్ వేదికగా నిర్వహించిన ప్రచార ర్యాలీ విషాదకరంగా మారింది. ఏకంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. నటుడిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. దీంతో టీవీకే విజయ్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. మరో వైపు పొత్తు పెట్టుకుంటేనే భవిష్యత్తులో బాగుంటుందని టాక్. ఇక కుమారపాలెం సభ నుంచి డీఎంకేపై యుద్ధానికి రెడీ అంటూ పళనిస్వామి కామెంట్స్ చేశారు. టీవీకే జెండాలను చూపిస్తూ గెలుపు మనదేనంటూ ప్రకటించారు.
Also Read : Harish Rao Fired on Congress : బీసీల పేరుతో కాంగ్రెస్ కొత్త డ్రామా : హరీశ్ రావు
