ముంబై : ఇంకొకరైతే తీవ్ర నిరాశకు గురవుతారు. కానీ ముంబైకి చెందిన క్రికెటర్ ఇషాన్ కిషన్ మాత్రం చివరి దాకా పోరాటం చేస్తూనే వచ్చాడు. తను జాతీయ స్థాయి జట్టులోకి రావడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. తాజాగా బీసీసీఐ ప్రకటించిన టి20 వరల్డ్ కప్ జట్టులో తనకు చోటు దక్కింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం. తన స్వస్థలం బీహార్ రాజధాని పాట్నా. వికెట్ కీపర్ , బ్యాటర్ గా గుర్తింపు పొందాడు. ఐపీఎల్ లో తను సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. ప్రత్యర్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా షాట్స్ ఆడడంలో తనకు తనే సాటి. ఇదిలా ఉండగా ప్రతీసారి జట్టు ఎంపిక చేసే సమయంలో ఇషాన్ కిషన్ పేరు వచ్చినా సెలెక్టర్లు పక్కన పెట్టారు.
ప్రస్తుతం తిరిగి జట్టులోకి రావడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం రెండు రోజుల క్రితమే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌కు చారిత్రాత్మక టైటిల్ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. పుణెలో జరిగిన ఫైనల్‌లో 49 బంతుల్లో 101 పరుగులు చేశాడు. 26 ఏళ్ల ఇషాన్ ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు, 10 మ్యాచ్‌లలో 197.32 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 517 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతని పరుగులలో రెండు సెంచరీలు , రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి, ఇది టీ20 ప్రపంచకప్‌కు ముందు అతని అద్భుతమైన ఫామ్‌ను చాటి చెబుతోంది. ఈ సందర్బంగా ఇషాన్ కిషన్ మీడియాతో మాట్లాడాడు. తనను ఎంపిక చేస్తారని అనుకోలేదన్నాడు.
