Actress Ramya Fired on Darshan Fans : యాక్ట‌ర్ ద‌ర్శ‌న్ ఫ్యాన్స్ పై న‌టి ర‌మ్య ఫిర్యాదు

రేప్ , చంపేస్తామంటూ బెదిరిస్తున్నార‌ని ఆవేద‌న

Hello Telugu - Actress Ramya Fired on Darshan Fans

Hello Telugu - Actress Ramya Fired on Darshan Fans

Actress Ramya : క‌న్న‌డ న‌టి ర‌మ్య ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. స‌హ న‌టుడు ద‌ర్శ‌న్ గురించి సోష‌ల్ మీడియాలో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. దీనిపై ద‌ర్శ‌న్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విరుచుకు ప‌డ్డారు. ఆపై త‌న‌ను అత్యాచారం చేయ‌డంతో పాటు హ‌త్య చేస్తామంటూ కామెంట్స్ చేయ‌డంతో తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు న‌టి ర‌మ్య‌ (Actress Ramya). ఈ మేర‌కు న‌టుడు ద‌ర్శ‌న్ అభిమానుల నుంచి త‌న‌కు ముప్పు ఉందంటూ వాపోయింది. ఈ మేర‌కు ఆన్ లైన్ దుర్వినియోగంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

Actress Ramya Files a Case

ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒక సెలబ్రిటీగా తాను నిత్యం ట్రోలింగ్ కు గుర‌వుతున్నాన‌ని తెలిపింది. కానీ నేను ఇంతవరకు దానిని అనుభవించ లేద‌ని బెంగ‌ళూరు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తన ఫిర్యాదు దాఖలు చేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు న‌టి ర‌మ్య‌ . రేణుకస్వామి హత్య కేసులో సుప్రీంకోర్టు విచారణపై జూలై 24న బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఒక నివేదికను పంచుకున్నట్లు చెప్పారు. ఈ కేసులో నటుడు దర్శన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడ‌ని ఆరోపించారు.

ఈ కేసుకు సంబంధించి (కర్ణాటక) హైకోర్టు నటుడు దర్శన్‌కు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు భారతదేశంలోని సామాన్య ప్రజలకు ఆశాకిరణం, రేణుక స్వామికి న్యాయం జరుగుతుందని తాను ఆశిస్తున్న‌ట్లు ఓ వార్తా ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని పంచుకున్న‌ట్లు తెలిపారు.

హత్య, అత్యాచార బెదిరింపులతో పాటు చాలా లైంగిక, అసభ్యకరమైన సందేశాలు కూడా ఉన్నాయని రమ్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ట్రోలింగ్ చాలా దారుణంగా ఉంది, నాకు (ఒక స్టార్) పరిస్థితి ఇలా ఉంటే, సాధారణ అమ్మాయిలకు ఎలా ఉంటుందో ఆలోచించడం మొదలు పెట్టానని, అందుకే నేను ఫిర్యాదు చేశాన‌ని చెప్పారు.

Also Read : Producer Shamnaas Shocking : న‌కిలీ సిగ్నేచ‌ర్ ప్రొడ్యూస‌ర్ పై కేసు

Exit mobile version