Producer Shamnaas Shocking : న‌కిలీ సిగ్నేచ‌ర్ ప్రొడ్యూస‌ర్ పై కేసు

సినిమా టైటిల్ హ‌క్కుల కోసం నిర్వాకం

Hello Telugu - Producer Shamnaas Shocking

Hello Telugu - Producer Shamnaas Shocking

Shamnaas : సినిమా టైటిల్ హక్కుల కోసం సంతకాన్ని నకిలీ చేసినందుకు నిర్మాతపై కేసు న‌మోదు చేసిన ఘ‌ట‌న కేర‌ళ‌లో చోటు చేసుకుంది. నటుడు, నిర్మాత నివిన్ పౌలీ సంతకాన్ని నకిలీ చేసి రాబోయే చిత్రం యాక్షన్ హీరో బిజు-2 టైటిల్‌ను పొందారనే ఆరోపణలపై మలయాళ చిత్ర నిర్మాత పిఎ షమ్నాస్‌పై (Shamnaas) పోలీసులు కేసు నమోదు చేశారు . పౌలీ ఫిర్యాదు మేర‌కు భారత శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్లు 465 (ఫోర్జరీ), 471 (నకిలీ పత్రం లేదా ఎలక్ట్రానిక్ రికార్డును నిజమైనదిగా ఉపయోగించడం) కింద షమ్నాస్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వెల్ల‌డించారు.

Producer Shamnaas Arrested

2023లో నివిన్ పౌలీ, దర్శకుడు అబ్రిడ్ షైన్ , షమ్నాస్ యాక్షన్ హీరో బిజు-2 సినిమా నిర్మాణం కోసం సంతకం చేసిన ఒప్పందంలో, ఈ సినిమా హక్కులన్నింటినీ నివిన్ పౌలీ నిర్మాణ సంస్థ పౌలీ జూనియర్‌కు ఇచ్చారు. కాగా ఒప్పందాన్ని దాచిపెట్టి, కేరళ ఫిల్మ్ ఛాంబర్ నుండి షమ్నాస్ ఈ సినిమా పేరు హక్కులను పొందారని పౌలీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందు కోసం నివిన్ పౌలీ నకిలీ సంతకంతో కూడిన పత్రాన్ని సమర్పించారని ఆరోపించారు. పోలీసు దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు పలరివట్టం పోలీసులు షమ్నాస్‌పై కేసు నమోదు చేశారు.

షమ్నాస్ దాఖలు చేసిన ఫిర్యాదుపై పోలీసులు గతంలో నివిన్ పౌలీపై కేసు నమోదు చేశారు, ఈ సినిమా హక్కులను తాను కలిగి ఉన్నానని, పౌలీ జూనియర్ కంపెనీ తనకు తెలియకుండానే విదేశీ హక్కులను మరొక కంపెనీకి ఇచ్చిందని ఆరోపించారు. కాంట్రాక్టుపై వివాదం ఇంకా పెండింగ్‌లో ఉండగా, నివిన్ పౌలీని బహిరంగంగా బెదిరించడం ద్వారా తన దారిలోకి తెచ్చు కోవడానికి షమ్నాస్ కుట్ర పన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా అబ్రిడ్ షైన్ దర్శకత్వం వహించిన నివిన్ పౌలీ నటించిన “యాక్షన్ హీరో బిజు” (2016) మలయాళంలో సూప‌ర్ హిట్ గా నిలిచింది.

Also Read : Popular Actor Srinivasan : రూ.5 కోట్ల స్కాం కేసులో న‌టుడు శ్రీ‌నివాస‌న్ అరెస్ట్

Exit mobile version