Kalpika : హైదరాబాద్ – తన కూతురు నటి కల్పిక మానసిక రుగ్మతతో బాధ పడుతోందని అన్నారు తండ్రి సంఘ్వర్ గణేష్. తనకు, కుటుంబానికి, ప్రజలకు ప్రమాదకరంగా మారిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తను ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని తెలిపారు.మందులు ఆపివేసిన తర్వాత రెండేళ్లుగా నిరాశకు గురైందని, అందుకే తరచుగా గొడవపడి ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు . తన కూతురిని పునరావాస కేంద్రానికి తిరిగి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా తండ్రి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Actress Kalpika Parents Complaint
తనపై న్యూసెన్స్ చేసిందంటూ కేసులు కూడా నమోదయ్యాయి హైదరాబాద్ లో. ఇక కల్పిక పూర్తి పేరు కల్పికా గణేష్ (Kalpika). పలు తెలుగు చిత్రాలలో నటించింది. ఆమె తన సినీ జర్నీని 2009లో ప్రయాణం అనే చిత్రంతో ప్రారంభించింది. తను హైదరాబాద్ లో పుట్టింది. సికింద్రాబాద్ లోని వివేకానంద కాలేజీలో బీఏ పూర్తి చేసింది. అందంగా ఉండడంతో తొలుత తన కెరీర్ ను మోడలింగ్ నుంచి స్టార్ట్ చేసింది. పలు వెబ్ సీరీస్ లలో కూడా నటించింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సీత ఆన్ ది రోడ్ వంటి చిత్రాలలో కూడా నటించింది కల్పికా గణేష్. లూజర్ , ఎక్కడికి ఈ పరుగు వంటి వెబ్ సిరీస్‌లలో కూడా కీ రోల్ పోషించింది. గత జూన్ నెలలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ప్రిజం అనే పబ్ లో నానా హంగామా సృష్టించింది. బిల్లు చెల్లించకుండా బూతులు మాట్లాడిందంటూ యాజామన్యం ఫిర్యాదు చేసింది. పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 324(4), 352 , 351(2) కింద FIR నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉండగానే మరో కేసు నమోదైంది. తాజాగా తండ్రి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
Also Read : Rashmika – Kingdom Success : నువ్వేంటో నాకు బాగా తెలుసు : రష్మిక మందన్నా
