Rashmika – Kingdom Success : నువ్వేంటో నాకు బాగా తెలుసు : ర‌ష్మిక మంద‌న్నా

కింగ్ డ‌మ్ స‌క్సెస్ నేషన‌ల్ క్ర‌ష్ కామెంట్స్

hellotelugu-rashmikamandhanna

Rashmika : నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నారు. త‌ను ప్రాణ ప్ర‌దంగా ప్రేమిస్తున్న‌, డేటింగ్ లో ఉన్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కీ రోల్ పోషించిన కింగ్ డ‌మ్ (Kingdom) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఊహించ‌ని రీతిలో భారీ స‌క్సెస్ టాక్ తెచ్చుకుంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా తొలి రోజు ఏకంగా రూ. 20 కోట్లు వ‌సూలు చేసింది. సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. కింగ్ డ‌మ్ ను సూప‌ర్ గా చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌సూరి. ఈ మూవీలో హీరో రౌడీతో పాటు హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే న‌టించింది. క‌థ‌కు త‌గ్గ‌ట్టు కిస్ సీన్ లో లీన‌మై పోయి న‌టించింది.

Rashmika Mandanna Key Comments on Vijay Kingdom Movie

రాబోయే రోజుల్లో భారీ ఎత్తున వ‌సూళ్లు సాధించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కింగ్ డ‌మ్ ను ప్ర‌ముఖ నిర్మాత బొమ్మ‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించాడు. త‌న‌కు ఈ మూవీ బాగా క‌లిసి వ‌చ్చింది. గ‌తంలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన మూవీస్ ఆశించిన మేర ఆడ‌లేదు. పూరీ జ‌గ‌న్నాథ్ తీసిన లైగర్ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఆ త‌ర్వాత స‌మంత‌తో న‌టించిన ఖుషీ నిరాశ ప‌రిచింది. మ్యూజిక‌ల్ గా హిట్ అయినా కాసులు రాలేదు.

దీంతో తీవ్ర నిరాశ‌కు లోన‌య్యాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. క‌సితో కింగ్ డ‌మ్ లో న‌టించాడు. మంచి మార్కులు ప‌డ్డాయి త‌న‌కు. ఈ సంద‌ర్బంగా త‌న స్నేహితుడు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన కింగ్ డ‌మ్ స‌క్సెస్ కావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేసింది. నీ మ‌న‌సులో ఏముందో నాకు బాగా తెలుసు అంటూ పేర్కొంది. ఆమె చేసిన కామెంట్స్ ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

Also Read : Beauty Kiara Advani : సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న కియారా అద్వానీ

Exit mobile version