Beauty Janhvi Kapoor : తిరుప‌తిలో స్థిర‌ప‌డాల‌ని ఉంది

న‌టి జాన్వీ క‌పూర్ కామెంట్స్

Hello Telugu - Beauty Janhvi Kapoor

Hello Telugu - Beauty Janhvi Kapoor

Janhvi Kapoor : బాలీవుడ్ ముద్దుగుమ్మ‌, అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి త‌న‌యురాలు జాన్వీ క‌పూర్ (Janhvi Kapoor) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ముఖ క‌మెడియ‌న్, యాంక‌ర్ క‌పిల్ శ‌ర్మ నిర్వ‌హిస్తున్న షోలో పాల్గొంది. ఈ ముద్దుగుమ్మ ఊహించ‌ని రీతిలో ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పింది. ప‌నిలో ప‌నిగా త‌న‌కు తిరుమ‌ల‌లో కొలువైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి అంటే ఎంత న‌మ్మ‌కమో, భ‌క్తో తెలిపింది. తాను స్వామి వారిని త‌లుచుకోకుండా, స్మ‌రించు కోకుండా ఉండ‌లేని పేర్కొంది జాన్వీ కపూర్. ప‌నిలో ప‌నిగా ఆ ప‌విత్ర‌మైన స్థ‌లంలోనే ఉండి పోవాల‌నే కోరిక త‌న‌లో ఉంద‌ని తెలిపింది. ఎందుకంటే ఈ ప్ర‌పంచంలో అంత గొప్ప ప్లేస్ ఉంటుంద‌ని తాను అనుకోవ‌డం లేదంటూ స్ప‌ష్టం చేసింది.

Janhvi Kapoor Interesting Comments

ఇదిలా ఉండ‌గా ప్ర‌తి ఏటా త‌న పుట్టిన రోజు సంద‌ర్బంగా తిరుమ‌ల‌కు వెళ్ల‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని స్ప‌ష్టం చేసింది. అదేమిటో అక్క‌డికి వెళ్ల‌గానే మ‌న‌సంతా హాయిగా, దూది పింజ లాగా మారిపోతుంద‌ని , ఆ మ‌హ‌త్తు, ఆ దైవ‌త్వం గురించి ఎంత చెప్పినా తక్కువేన‌ని అంది జాన్వీ క‌పూర్. త‌ను , సిద్దార్త్ మ‌ల్హోత్రా క‌లిసి న‌టించిన పరం సుంద‌రి ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ప‌నిలో ప‌నిగా పెళ్లి పై, పిల్ల‌ల‌పై కూడా త‌న అభిప్రాయాన్ని పంచుకుంది. త‌న‌కు ముగ్గురు పిల్ల‌ల‌ను క‌నాల‌ని ఉంద‌ని చెప్పింది ఈ లవ్లీ బ్యూటీ. అంతే కాకుండా తాను ప్రాణ పదంగా ప్రేమించే తిరుప‌తిలోనే స్థిర ప‌డాల‌ని ఉంద‌ని పేర్కొంది.

Also Read : TTD Gets Huge Donations : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి భారీ విరాళాలు

Exit mobile version