ACB Raids : అమరావతి – ఏపీలో అతి పెద్ద అవినీతి తిమింగలం పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఈ ఎన్ సీ అవినీతి వ్యవహారం బయట పడింది. ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బులు తాను ఇప్పిస్తానని రూ. 5 కోట్లు కమీషన్ ఇవ్వడానికి ఒప్పుకుంటేనే పని చేసి పెడతానంటూ ఓ కాంట్రాక్ట్ సంస్థ యజమాని తో బేరం సాగించారు సదరు ఈఎన్సీ అధికారి అబ్బవరపు శ్రీనివాస్. తనతో కాకుండా వేరెవరితో పైరవీ చేసినా, ఆ విషయం తనకు తెలిసిన వెంటనే డబ్బులు రాకుండా చేస్తానని మనోడు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. కాగా రూ. 5 కోట్లు అంటే మరీ ఎక్కువ అని.. అంత ఇచ్చుకోలేమని.. తగ్గించుకోవాలని కోరారు కాంట్రాక్టర్ సాయి నిర్మాణ సంస్థ అధినేత కృష్ణంరాజు.
ACB Raids Shocking
అయితే ఈ నెలాఖరులోనే రిటైర్మెంట్ ఉండటం వల్ల ఆలస్యమైతే మొత్తంగా నష్టపోతానని భావించాడు ఈఎన్సీ అధికారి శ్రీనివాస్. రూ . 50 లక్షల కమీషన్ పై డబ్బులు ఇప్పించేందుకు అంగీకారం కుదుర్చుకున్నడు చివరకు. ఇదిలా ఉండగా ఒక వైపు లంచాధికారితో బేరం సాగిస్తూనే.. మరోవైపు ఏసీబీ (ACB Raids) అధికారులకు సమాచారం ఇచ్చడు సదరు కాంట్రాక్టర్ .ఒప్పందం ప్రకారం అధికారికి అడ్వాన్స్ మొత్తం రూ.25 లక్షలు ఇచ్చాడు. డబ్బులు ఇస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈఎన్సీ శ్రీనివాస్ విజయవాడ గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే శాఖకు సంబంధించిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్ పట్టించడం విశేషం.
Also Read : KTB Chief Gantla Srinubabu Interesting : రక్షణ రంగ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం


















