Aadi Srinivas : హైదరాబాద్ – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. సీఎం రమేష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. తన సోదరి ఎమ్మల్సీ కవితను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు రాయబారం నడిపింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని కవిత బయట పెట్టిందన్నారు. తను అడిగిన ప్రశ్నలకు ఇంతవరకూ సమాధానం చెప్ప లేదన్నారు. నువ్వు, నీ అయ్య తెలంగాణకు పట్టిన శని అంటూ ఫైర్ అయ్యారు.
Aadi Srinivas Slams KTR
సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను సర్వ నాశనం చేసిన కోవర్టులు మీరు కాదా అంటూ ఫైర్ అయ్యారు ఆది శ్రీనివాస్ (Aadi Srinivas). పసిపాప లాంటి రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసిన దుర్మార్గులు మీరంటూ సంచలన కామెంట్స్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రా వాళ్లతో తిరిగింది మీరు కాదా అది మరిచి పోయారని అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. మరోసారి తెలంగాణ పేరుతో రాజకీయాలు చేస్తున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసినందుకే జనం మిమ్మల్ని గత ఎన్నికల్లో అధికారం నుంచి దూరం చేశారన్నారు.
అది కూడా మరిచి పోయి , పవర్ పోయిందన్న అక్కసుతో తమ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ చూస్తూ ఊరుకునేది లేదన్నారు ఆది శ్రీనివాస్. ఇకనుంచైనా నోరు జాగ్రత్త పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు . ఇప్పుడు మళ్లీ బనకచర్లను అడ్డు పెట్టుకుని తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
Also Read : Minister Savitha Shocking Comments : జగన్ కు రాజకీయ భవిష్యత్తు లేదు
