శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : పుట్టపర్తి లాంటి ఓ విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రంలో ఏర్పాటు అవుతున్న ఈ ప్రాజెక్టు ఏపీ సహా దేశ రక్షణ చరిత్రలో ఓ చారిత్రాత్మక అధ్యాయాన్ని జోడించ బోతోందన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. శుక్రవారం ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగించారు భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో టెక్నాలజీ, అభివృద్ధి గురించి ఆలోచించే దార్శనిక నేత చంద్రబాబు నాయుడు లాంటి నేతను ఎక్కడా చూడలేదన్నారు. దేశ, విదేశాల్లో చాలా విశిష్టమైన పురస్కారాలు పొందిన వ్యక్తి అయిన. క్వాంటం సహా ఆధునిక టెక్నాలజీలను ఏపీకి తీసుకు వచ్చారన్నారు. గూగుల్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీలు ఏపీని ఎంచుకున్నాయని కొనియాడారు. ఏపీ అంటే అడ్వాన్స్డ్ ప్రదేశ్. దేశానికి ఓ రోల్ మోడల్ గా ఏపీ మారిందన్నారు.
వ్యూహాత్మక రక్షణ ప్రాజెక్టులో నాలుగు డిఫెన్సు కంపెనీలకు కూడా శంకుస్థాపన జరిగాయన్నారు. కర్నూలు డ్రోన్ సిటీలో 8 కంపెనీలకు కూడా శంకుస్థాపన చేశాం అన్నారు రాజ్ నాథ్ సింగ్. అంతర్జాతీయంగా విభిన్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధార పడలేం అన్నారు. అందుకే ఆత్మ నిర్భరత అనేది ఓ కీలకమైన అంశం అని పేర్కొన్నారు. ఈ తరహా ప్రాజెక్టులన్నీ మన స్వదేశీ తయారీతో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. పుట్టపర్తిలో ఏర్పాటు చేసే ప్రాజక్టును డీఆర్డీఓ లో భాగమైన ఏడీఏ అభివృద్ధి చేస్తోందన్నారు. ఏరో నాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధునికతరం యుద్ధ విమానాల అభివృద్ధిపై పని చేస్తోందని కితాబు ఇచ్చారు.
















