భార‌త్ న్యూజిలాండ్ మ‌ధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

ఇరు దేశాల ప్ర‌ధాన‌మంత్రులు కీల‌క నిర్ణ‌యం

hellotelugu-NewzelandIndia

ఢిల్లీ : భార‌త్, న్యూజిలాండ్ దేశాల మ‌ధ్య స్వేచ్ఛాపూరిత వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా న్యూజిలాండ్ ప్ర‌ధాన‌మంత్రి వెల్ల‌డించారు. సోమవారం తాను భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడాన‌ని చెప్పారు. ఇరు దేశాల మ‌ధ్య ఇప్ప‌టికే ఉన్న బంధాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. స్వేచ్చాయుత వాణిజ్య ఒప్పందంలో భాగంగా కీల‌క అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ని తెలిపారు ఇరువురు నేత‌లు. ఇందులో ప్ర‌ధానంగా రక్షణ, క్రీడలు, విద్యతో పాటు ఇరు దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య ద్వైపాక్షిక స‌హ‌కారం కూడా పెంపొందిచు కోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లూకాన్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గంట‌కు పైగా మాట్లాడారు. ఇది ఇరు దేశాల‌కు ఒక మైలురాయిగా నిలిచి పోతుంద‌ని ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ.

తామిద్ద‌రి మ‌ధ్య ఇవాళ కీల‌క‌మైన సంభాష‌ణ చోటు చేసుకుంద‌ని తెలిపారు. ప్ర‌ధానంగా రెండు దేశాల మధ్య ఎక్కువ వాణిజ్యం, పెట్టుబడి, ఆవిష్కరణ, భాగస్వామ్య అవకాశాలకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని నాయకులు అంగీకరించారు. ప్రజల సంబంధాలతో సహా ద్వైపాక్షిక సహకారం ఇతర రంగాలలో పురోగతిని కూడా నాయకులు స్వాగతించారు. కాగా మార్చి 2025లో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ భారతదేశంలో ప‌ర్య‌టించారు. ఆయ‌న టూర్ కీల‌క‌మైన ఒప్పందాలు చేసుకునేందుకు వీలు ప‌డింది. ఆర్థిక రంగంలో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటాయ‌ని, మార్కెట్ ఆధారిత ప‌రిశ్ర‌మ‌ల‌కు వీలు ప‌డుతుంద‌ని ఇరువురు నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.

Exit mobile version