Madhavilatha: తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి. గడచిన పదేళ్ళుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పోలిస్తే టాలీవుడ్ కు మంచి ప్రాధాన్యం ఇచ్చేది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చింది. దీనితో టీఆర్ఎస్ కు సన్నిహితంగా ఉండే నటీనటీలు టీఆర్ఎస్ నాయకులను ఓదారుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటి అనసూయ, సురేఖ కుమార్తె చేసిన పోస్టులు వైరల్ గా మారాయి. మరోవైపు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్… త్వరలో కాంగ్రెస్ నాయకులను కలుస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ మాధవీలత(Madhavilatha) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Madhavilatha – తెలంగాణాలో రావణ రాజ్యమే అంటున్న మాధవీలత
“నచ్చావులే’ సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన మాధవీలత(Madhavilatha)… ఆడపాదడపా అవకాశాలు అందుకున్నా… చెప్పుకోదగ్గ విజయాలేవీ వరించలేదు. దీనితో ఆమె బిజేపిలో చేరి 2019లో గుంటూరు వెస్ట్‌లో ఎమ్యెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ప్రస్తుతం బిజేపిలో ఉన్న ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలుపొందడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. క తెలంగాణలో నడిచేది రావణ రాజ్యమే అంటూ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా కామెంట్ చేశారు. ”ఐదేళ్ల తర్వాత తెలంగాణలో తినడానికి తిండి ఉండదు, ఉద్యోగాలు రావు, మహిళలకు భద్రత కరువవుతుంది. హిందూ పండుగలు జరగవు, స్వేచ్చ అనేది కనిపించదు. తెలంగాణ కాంగ్రెస్ లవర్స్ అందరికీ నా శుభాకాంక్షలు. ఇకపై రావణ సామ్రాజ్యమే. ఎంజాయ్ చేయండి’’ అంటూ ఆమె ఇన్ స్టాలో పోస్ట్ చేసిది. అంతే కాదు కాంగ్రెస్‌తో పోలిస్తే… బీఆర్‌ఎస్‌కు 99 మార్కులు ఇస్తాను’ అని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మాధవీలతపై ఫైర్ అవుతున్న నెటిజన్లు
ఇది ఇలా ఉండగా మాధవీలత కామెంట్స్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. “అది ప్రజలు ఇచ్చిన తీర్పు. దానిని అందరూ గౌరవించాలి. ఓసారి నువ్వు పార్టీ నుంచి బయటకొచ్చి చూడు. లోకం ఎలా ఉందో తెలుస్తుంది’ అని ఓ నెటిజెన్ కామెంట్ చేశారు. మణిపూర్‌లో ఓ మహిళను నగ్నంగా రోడ్డు మీద నడిపించిన సమయంలో రూలింగ్‌లో ఉన్న నీ పార్టీ ఏం చేసింది? అని ప్రశ్నించాడు మరో నెటిజన్. విమెన్ సేఫ్టీ గురించి మీరు మాట్లాడొద్దు అంటూ హెచ్చరించాడు.
Also Read : Balakrishna: ముగ్గురు భామలతో బాలకృష్ణ కొత్త సినిమా