Indian Railways : రైల్వే ట్రాక్ మరమ్మతులు, సాంకేతిక పనుల దృష్ట్యా రాబోయే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కొన్ని రైళ్లు తాత్కాలికంగా రద్దు చేయబడుతున్నాయి. ప్రయాణానికి సిద్ధమవుతున్నవారు ముందుగా తమ రైలు ప్రయాణ వివరాలను పరిశీలించుకోవాలని రైల్వే శాఖ (Indian Railways) విజ్ఞప్తి చేసింది.
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది రోజూ రైళ్లను ఉపయోగిస్తున్న పరిస్థితిలో, ఇలాంటి మార్పులు ప్రయాణికులపై ప్రభావం చూపే అవకాశముండటంతో అధికారులు ముందస్తు సమాచారాన్ని అందిస్తున్నారు. రద్దైన రైళ్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
Indian Railways – పూర్తిగా రద్దు చేసిన రైళ్లు:
- 18175/18176 హతియా – ఝార్సుగూడ – హతియా మెము ఎక్స్‌ప్రెస్: ఆగస్టు 18 నుండి సెప్టెంబర్ 10 వరకు రద్దు.
- 17007 చర్లపల్లి – దర్భంగా ఎక్స్‌ప్రెస్ (రాంచీ మార్గంగా): ఆగస్టు 26, సెప్టెంబర్ 9 తేదీలలో రద్దు.
- 17008 దర్భంగా – చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ (రాంచీ మార్గంగా): ఆగస్టు 29, సెప్టెంబర్ 12 తేదీలలో రద్దు.
- 18523 విశాఖపట్నం – బనారస్ ఎక్స్‌ప్రెస్ (రాంచీ మార్గంగా): ఆగస్టు 27, 31, సెప్టెంబర్ 7, 10 తేదీలలో రద్దు.
- 18524 బనారస్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (రాంచీ మార్గంగా): ఆగస్టు 28, సెప్టెంబర్ 1, 8, 11 తేదీలలో రద్దు.
- 17005 హైదరాబాద్ – రక్సౌల్ ఎక్స్‌ప్రెస్: ఆగస్టు 28న రద్దు.
- 17006 రక్సౌల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్: ఆగస్టు 31న రద్దు.
- 07051 చర్లపల్లి – రక్సౌల్ స్పెషల్: ఆగస్టు 30న రద్దు.
- 07052 రక్సౌల్ – చర్లపల్లి స్పెషల్: సెప్టెంబర్ 2న రద్దు.
- 07005 చర్లపల్లి – రక్సౌల్ స్పెషల్: సెప్టెంబర్ 1న రద్దు.
- 07006 రక్సౌల్ – చర్లపల్లి స్పెషల్: సెప్టెంబర్ 4న రద్దు.
- 18310 జమ్మూ తావి – సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్: సెప్టెంబర్ 7న రద్దు.
- 13425 మాల్డా టౌన్ – సూరత్ ఎక్స్‌ప్రెస్: సెప్టెంబర్ 6న రద్దు.
- 13426 సూరత్ – మాల్డా టౌన్ ఎక్స్‌ప్రెస్: సెప్టెంబర్ 8న రద్దు.
- 15028 గోరఖ్‌పూర్ – సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్: సెప్టెంబర్ 8న రద్దు.
- 18309 సంబల్పూర్ – జమ్మూ తావి ఎక్స్‌ప్రెస్: సెప్టెంబర్ 9న రద్దు.
- 15027 సంబల్పూర్ – గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్: సెప్టెంబర్ 9న రద్దు.
స్వల్పకాలికంగా నిలిపివేసిన రైళ్లు:
- 15028 గోరఖ్‌పూర్ – సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్: ఆగస్టు 23, 27, 29, 31 తేదీలలో హతియా స్టేషన్‌లో నిలిపివేత.
- 15027 సంబల్పూర్ – గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్: ఆగస్టు 24, 26, 28, 30, సెప్టెంబర్ 1 తేదీలలో హతియా స్టేషన్‌లో నిలిపివేత.
ప్రయాణికుల కోసం సూచనలు:
ఈ మార్పులు వారి ప్రయాణాలపై ప్రభావం చూపవచ్చునన్న దృష్ట్యా, ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు సంబంధిత రైళ్ల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లు లేదా ‘ఎన్‌టీఈఎస్’ (NTES) మొబైల్ యాప్ ద్వారా తనిఖీ చేయడం మేలని రైల్వే శాఖ (Indian Railways) సూచించింది. ప్రత్యామ్నాయ రైళ్ల సేవలు లేదా మార్గాల గురించి తెలుసుకొని ముందస్తుగా సన్నద్ధమవ్వాలని అధికారులు తెలిపారు.
Also Read : GST Shocking UPI : యూపీఐ వాడే వారికి షాక్ ఇచ్చిన జిఎస్టి..2వేలకు పైగా యూపీఐ చేసేవారికి షాక్
















