Bandi Sanjay: హైదరాబాద్ – కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీపై తమ పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు అక్షరాల సత్యమేనని ధ్రువీకరించారు. కవితను విడుదల చేయిస్తే తమ పార్టీని బీజేపీలో కలుపుతామంటూ ప్రతిపాదన చేశారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇవాళ తామేదో సుద్దపూసలం అయినట్టు కేటీఆర్ సవాల్ విసరడం ఇడ్డూరంగా ఉందన్నారు కేంద్ర మంత్రి.
Union Minister Bandi Sanjay Shocking Comments on BRS Party, KTR
సీఎం రమేష్ నిన్న అనకాపల్లి వేదికగా చేసిన ప్రతి మాటా వాస్తవమేనని పేర్కొన్నారు. అయితే తమ పార్టీ అందుకు ఒప్పుకోలేదని, నిరభ్యంతరంగా తిరస్కరించామన్నారు. ఇవాళ నిస్సిగ్గుగా కేటీఆర్ అలా ప్రతిపాదించ లేమంటూ చెప్పడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు టికెట్ ఇవ్వడానికి కేసీఆర్ సుముఖంగా లేరంటూ బాంబు పేల్చారు. కేటీఆర్ ఎమ్మెల్యే అయిందే రమేష్ వల్ల అని అన్నారు. తాను సీఎం రమేష్ ను తీసుకు వస్తానని, కేటీఆర్ కు దమ్ముంటే డేట్ ఫిక్స్ చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay). ఈ తాజా వివాదంలో సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదంటూ స్పష్టం చేశారు .
నువ్వో నేనో తేల్చుకుందాం దా అంటూ సవాల్ విసిరారు కేంద్ర మంత్రి. అయితే ప్రస్తుతానికి వేదిక హైదరాబాద్ కాకుండా కరీంనగర్ జిల్లా వేదికగా చర్చించు కుందామంటూ సీఎం రమేష్, కేటీఆర్ లకు పిలుపునిచ్చారు. దీనిపై కేటీఆర్ త్వరగా స్పందించాలన్నారు.
Also Read : Popular Minister Nimmala – TTD : తిరుమలకు పూర్వ వైభవం తీసుకు వచ్చాం


















