CM Revanth Reddy : హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి గురించి పలు అంశాలు ప్రస్తావించారు. తెలంగాణ కేసీఆర్ వల్ల రాలేదన్నారు. కేవలం జైపాల్ రెడ్డి వల్లనే వచ్చిందని చెప్పారు. ఆయనకు రాజకీయ పరంగా వ్యతిరేకులు ఉండవచ్చని, కానీ వ్యక్తిగతంగా అందరూ మిత్రులేనని అన్నారు. చివరి క్షణం దాకా అజాత శత్రువుగా బతికాడని కొనియాడారు. ఆయన తో తనకు బంధుత్వం కలిగి ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు సీఎం.
CM Revanth Reddy Appreciates Jaipal Reddy
పార్లమెంటులో చర్చ లేకుండానే బిల్లును ఆమోదించడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆనాడు జైపాల్ రెడ్డి చొరవతోనే తెలంగాణ ఏర్పాటు చేసినట్లు ఒక సందర్భంలో సోనియాగాంధీ నాతో చెప్పారని గుర్తు చేశారు. జైపాల్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులే కానీ శత్రువులు లేరన్నారు. ప్రజాస్వామ్య విలువలను ప్రాణ సమానంగా , సిద్ధాంత రాజకీయాలను జీవన గమ్యంగా మలుచుకున్న మహా నాయకుడని కొనియాడారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.
ఆయన జ్ఞాపకంగా ‘జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డ్’ ప్రదానం చేయడం రేపటి తరానికి నిన్నటి విలువలను అందించే మంచి ప్రయత్నం అన్నారు. ఆయనే పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ప్రముఖ ఆర్ధిక నిపుణులు, విశ్లేషకులు మోహన్ గురుస్వామితో పాటు ఇతరులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియ చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఇక్ఫై, క్యాపిటల్ ఫౌండేషన్ కు థ్యాంక్స్ తెలిపారు. తాను సీఎం అయిన తర్వాత సభ నుంచి ఎవరినీ సస్పెండ్ చేయ లేదని అన్నారు. ప్రతిపక్షాలు సహేతుకమైన సూచనలు, సలహాలను తీసుకోవడానికి తమకు ఇబ్బంది అంటూ ఏమీ లేదన్నారు.
Also Read : Aadi Srinivas Fired on KTR : కల్వకుంట్ల కుటుంబం తెలంగాణకు గ్రహణం


















