Minister Vasamsetti : కర్నూలు జిల్లా – రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరాక ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ (Minister Vasamsetti). శుక్రవారం కర్నూల్ జిల్లా పత్తికొండలో పర్యటించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు.
కృష్ణగిరి మండలం బొంతిరాళ్ల గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే పత్తికొండ కేఈ శ్యాం కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
Minister Vasamsetti Subhash Key Comments
పెరిగిన పింఛన్లు, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సైతం మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజలకు వివరించారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు సౌకర్యాలు అమలు కానున్నాయని వెల్లడించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా మంత్రి వాసం శెట్టి మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వంలో ప్రజలు విసిగి పోయారని అన్నారు. అన్ని వ్యవస్తలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తాము వచ్చాక వాటిని గాడిలో పెడుతున్నామని తెలిపారు. అందుకే జగన్ రెడ్డిని, ఆయన పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. తాము వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లేబర్ వెల్ఫేర్ బోర్డు వైస్ చైర్మన్ వెంకట శివుడు యాదవ్, కూటమి నాయకులు, క్లస్టర్ ఇంచార్జిలు కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : MP Gurumurthy Shocking Discussion : మెడికల్ గ్రాడ్యుయేట్స్ సమస్యలు పరిష్కరించాలి

















