MP Gurumurthy : ఢిల్లీ – విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ల ఇంటర్న్‌షిప్ సమస్యపై లోక్‌సభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు తిరుపతి ఎంపి గురుమూర్తి (MP Gurumurthy). ఇదే సమస్యపై గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానని తెలిపారు. మరోసారి పార్లమెంటు ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా మూడేళ్ల కోర్సు చేయాలని నిబంధన ఉందని కేంద్ర ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు ఈ నిబంధన ఇతర రాష్ట్రాలలో ఉన్న ఇంటర్న్‌షిప్ వ్యవధి, స్టైపెండ్‌కు భిన్నంగా ఉన్నాయా, ఆంధ్రప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాలలో ఇంటర్న్‌షిప్ పరిస్థితులలో వ్యత్యాసాలకు కారణాలు ఏమిటి అని నిలదీశారు ఎంపీ.
MP Gurumurthy Key Comments
జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అన్ని రాష్ట్రాలలో ఇంటర్న్‌షిప్ వ్యవధిలో ఒకటే నిబంధన ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా, అలా అయితే వివరాలు తెలుపాలని కోరారు గురుమూర్తి.
ఎంపీ లేవదీసిన ప్రశ్నలకు కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సమాధానం ఇచ్చారు. విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు భారతదేశంలో వైద్యం చేయడానికి లైసెన్స్ లేదా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ పొందడానికి నేషనల్ మెడికల్ కమిషన్ 2021లో జారీ చేసిన నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. ఈ నియమాలు దేశవ్యాప్తంగా విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు అందరికీ ఒకేలా వర్తిస్తాయని పేర్కొన్నారు. కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ కు సంబంధించిన నియమాలను నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు 2021ని అనుసరించి నిర్వహించ బడతాయని తెలిపారు.
కోవిడ్-19 మహమ్మారి, యుద్ధాలు వంటి పరిస్థితుల వలన విద్యను అభ్యసించడంలో వచ్చిన అడ్డంకులను దృష్టిలో ఉంచుకుని, నేషనల్ మెడికల్ కమిషన్ 2023 డిసెంబర్ 7న, 2024 జూన్ 19న పబ్లిక్ నోటీసుల ద్వారా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని తెలియజేసారు.
Also Read : Popular Director Sandeep Reddy Vanga-Saiyaara : వంగా సందీప్ రెడ్డికి మోహిత్ సూరి థ్యాంక్స్

















