PM Modi : ఐజీఎస్టీ పేరుతో తెలంగాణ నుండి రూ.924 కోట్లు రికవరీ చేసింది మోదీ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025- 26) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) వరకూ రాష్ట్రానికి వచ్చిన జీఎస్టీ వసూళ్లలో రూ.924 కోట్లను కేంద్రం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ నెలలో తెలంగాణ నుంచి ఐజీఎస్టీ కింద రూ.2100 కోట్ల మేర రావాలని, అంతకన్నా రూ.924 కోట్లు తక్కువగా ఉన్నందున వాటిని రికవరీ చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది.
PM Modi Shocking Telangana
ఐజీఎస్టీ వసూళ్లలో తగ్గుదల ఉన్నందున ఈ మొత్తాన్ని తీసుకున్నట్లు పేర్కొంది కేంద్ర సర్కార్. ఈ సొమ్ము పోను తొలి త్రైమాసికంలో జీఎస్టీ, వ్యాట్ కలిపి మొత్తం వసూళ్లు రూ.18,856 కోట్లు రాష్ట్ర ఖజానాకు సమకూరాయి. పన్ను వసూళ్ల ద్వారా ఆదాయం కనీసం 10 శాతం పెరిగితే తప్ప రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది.
అసలే 6 శాతం వృద్ధి రేటు ఉంటే, అందులోనూ కేంద్రం సొమ్ము రికవరీ చేయడంతో 1.8 శాతానికి పడి పోయింది.
Also Read : Mumbai Train Blast Shocking Update : ముంబై ట్రైన్ల పేలుళ్ల కేసులో సంచలన తీర్పు

















