సినిమా ఎలా తీయాలన్న దానిపై దృష్టి పెడతా. విడుదలయ్యాక హాయిగా నిద్ర పోతా. ఇక వేరే ఏ దానిని పట్టించుకోను. విమర్శలను స్వీకరిస్తా. అభిప్రాయాలను గౌరవిస్తా. నా మానాన నేను ఉండేందుకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తానంటూ ప్రకటించాడు ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్.
తాజాగా సంచలన కామెంట్స్ చేశాడు. కార్తీ నటించిన జపాన్ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు లోకేష్ కనగరాజ్. మీడియాతో మాట్లాడాడు. తను తళపతి విజయ్ తో తీసిన లియో చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకు పోతోంది. మరో వైపు ఈ వసూళ్ల సంఖ్య ఫేక్ అంటూ ప్రచారం జరిగింది.
ఇందులో నిజం ఎంత అన్న ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు తమిళ సినీ డైరెక్టర్. సినిమాను ఎలా సక్సెస్ ఫుల్ గా తీయాలనే దానిపై ఆలోచిస్తా. థియేటర్ల వద్దకు వెళతా. బాగుంటే ఆదరిస్తారు. లేదంటే తిరస్కరిస్తారు. నా వరకైతే బెస్ట్ మూవీ తీశానని అనుకుంటున్నానని అన్నాడు లోకేష్ కనగరాజ్.
లియో కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 461 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో తళపతి విజయ్ తో పాటు త్రిష కృష్ణన్, సంజయ్ దత్ , అర్జున్ నటించారు.