గ్రీస్ : సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ , కావ్య మారన్ వివాహ వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వేడుకలో ఆయన నృత్యం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనిరుధ్ , కావ్య మారన్ మంగళారం గ్రీస్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి వారి కుటుంబ సభ్యులు , పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రజనీకాంత్ తన చిత్రం ‘వేట్టయన్’ లోని ‘మనసిలాయో’ పాటకు ఉత్సాహంగా నృత్యం చేయడం చర్చకు దారితీసేలా చేసంది. ఈ పాటకు అనిరుధ్ సంగీతం అందించడం విశేషం. ఇది ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. సూపర్ స్టార్ చేసిన ఉత్సాహ భరితమైన నృత్యం అభిమానులను అలరించింది, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా ప్రాచుర్యం పొందుతోంది.
రజనీకాంత్‌కు అనిరుధ్ రవిచందర్ తో కుటుంబ పరంగా సన్నిహిత అనుబంధం ఉంది. అనిరుధ్ ఆయనకు మేనల్లుడు అవుతారు. అంతేకాకుండా ‘పేట’, ‘దర్బార్’, ‘జైలర్’ ‘వేట్టయన్’ వంటి పలు చిత్రాల్లో వీరిద్దరూ కలిసి పనిచేశారు. అనిరుధ్ – కావ్యల వివాహం సినీ , క్రికెట్ ప్రపంచాల్లో చర్చనీయాంశమైంది. కావ్య మారన్ ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ జట్టుతో సంబంధం కలిగి ఉండగా అనిరుధ్ తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి సంగీత దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఈ జంట నవంబర్ 21న చెన్నైలో ఒక భారీ వివాహ రిసెప్షన్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, ఇతర ప్రముఖ వ్యక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.
















