హైదరాబాద్ : ప్రముఖ సంస్థ ఆపిల్ కీలక ప్రకటన చేసింది. హోమ్ పాడ్ తో పాటు కొత్త స్మార్ట్ హోమ్ పరికరాలు మార్కెట్ లోకి తీసుకు రానుంది. స్మార్ట్ హోమ్ టెక్నాలజీ రంగంలో ఆపిల్ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోబోతోందని సూచిస్తోంది. ఈ సందర్భంగా అక్టోబర్ 13న ఆపిల్ సంస్థ ఆపిల్ ఈవెంట్ పేరుతో ముందుకు రానుంది. వెల్ కమ్ హోమ్ పేరుతో దీనిని నిర్వహించాలని నిర్ణయించింది ఆపిల్. ఆరోజు జరగబోయే తన తదుపరి ఉత్పత్తి ఆవిష్కరణపై ఆపిల్ ఆసక్తిని రేకెత్తించడం ప్రారంభించింది. ఈ ప్రకటనను బట్టి చూస్తే, కంపెనీ తన స్మార్ట్ హోమ్ ఉత్పత్తుల శ్రేణిని విస్తరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న పరికరాల అప్డేట్ వెర్షన్లతో పాటు కొత్త ‘హోమ్ హబ్’ కూడా పరిచయం కావచ్చు. ఇందుకు సంబంధించి ఆపిల్ మార్కెటింగ్ విభాగం హెడ్ గ్రెగ్ జోస్వియాక్ ఎక్స్ లో ఒక టీజర్‌ను పంచుకున్నారు.
ఇందులో ఇద్దరు వ్యక్తులు చేతితో కుట్టే ఎంబ్రాయిడరీ ద్వారా పాతకాలపు (రెట్రో) ఆపిల్ లోగోను రూపొందించడం కనిపిస్తుంది. ఆ లోగో కింద వెల్ కమ్ హోం అనే పదాలు ఉన్నాయి. ఈ దృశ్యం స్మార్ట్ హోమ్ ఉత్పత్తులలో విస్తృతంగా ఉపయోగించే కనెక్టివిటీ ప్రమాణమైన త్రెడ్ గురించి కూడా ఊహాగానాలకు దారితీసింది. అయితే ఈ కార్యక్రమం సాంప్రదాయ లాంచ్ ఈవెంట్ కంటే ఆపిల్ ఒకఅనుభవం లాంటిది కావచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో మాక్ బుక్ నియో ను పరిచయం చేసిన సందర్భం లాంటిదే ఇది కూడా ఉండవచ్చు. ఎంపిక చేసిన మీడియా సంస్థలకు ఆహ్వానాలు అందాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమం న్యూయార్క్ నగరంలో ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.


















