న్యూఢిల్లీ : ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో తమను ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్ ను ఆ జట్టు స్వంత మైదానంలోనే చెప్పి మరీ ఓడించింది. ప్రధానంగా ఈ క్రెడిట్ మాత్రం ఆర్సీబీకి చెందిన స్టార్ బౌలర్లు జోష్ హాజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ లకు దక్కుతుంది. కళ్లు చెదిరే బంతులకు బ్యాటర్లు వణికి పోయారు. ఆడలేక పెవిలియన్ బాట పట్టారు ఒకరి వెంట మరొకరు. ఈ పతనం తొలి బంతి నుంచే ప్రారంభమైంది. దీంతో కేవలం 75 పరుగులకే చాప చుట్టేసింది. పోరెల్ , మిల్లర్ గనుక ఆడక పోయి ఉంటే కనీసం 30 పరుగులు కూడా చేసి ఉండేది కాదేమో ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్ కావడం విశేషం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసింది. ఆర్సీబీ బౌలర్లు జోష్, భువీలు రెచ్చి పోయారు. బ్యాటర్లకు చుక్కలు చూపించారు. హాజిల్ వుడ్ కేవలం 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక భువనేశ్వర్ కుమార్ 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో 16.3 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అభిషేక్ పోరెల్ 30 రన్స్ చేయగా మిల్లర్ 19 రన్స్ మాత్రమే చేశారు. లేక పోతే ఆ స్కోర్ కూడా అయి ఉండేది కాదు. ఇక ఆర్సీబీ 6.3 ఓవర్లలో పడిక్కల్ 34 , కోహ్లీ 24 రన్స్ చేసి జట్టుకు విజయాన్ని ఆడుతూ పాడుతూ కట్టబెట్టారు.



















