లక్నో : ఎప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరిని అదృష్టం వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ సంచలనంగా మారాడు. ఐపీఎల్ 2026 లో భాగంగా లక్నో వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ ఆద్యంతమూ ఆసక్తిని, ఉత్కంఠను రేపింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. విచిత్రం ఏమిటంటే ఇరు జట్ల మ్యాచ్ టైగా ముగిసింది. ముందుగా బ్యాటింగ్ కు దిగింది కేకేఆర్. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 రన్స్ చేసింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కూడా 155 రన్స్ చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో అంపైర్లు సూపర్ ఓవర్ ప్రకటించారు.
మొదటగా సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ చేసింది ఎల్ ఎస్ జీ. కేవలం ఒకే ఒక్క పరుగు చేయడంతో ఇక కేకేఆర్ విజయం ఖాయమని తేలి పోయింది. ఓ వైపు వికెట్లు పడి పోతున్నా ఎక్కడా తొణకకుండా 83 పరుగులు చేశాడు రింకూ సింగ్. తనే సూపర్ ఓవర్ లో ఆడేందుకు వచ్చాడు. తొలి బంతికే ఫోర్ కొట్టాడు. కోల్ కతా నైట్ రైడర్స్ కు చిరస్మరణీయైన విజయాన్ని చేకూర్చి పెట్టాడు. ఇక లక్నో బౌలర్ ఆవేశ్ ఖాన్ మిస్సైల్ లాంటి బంతులు వేసి ముప్పు తిప్పలు పెట్టాడు. తను కేవలం 23 రన్స్ మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు కూల్చాడు. రింకూ సింగ్ చేసిన పరుగుల్లో 7 ఫోర్లు , 5 భారీ సిక్సర్లు ఉన్నాయి.


















