ముంబై : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జ్యోతిష్కుడు అశోక్ ఖారత్ , మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలి చకాంకర్ ల సెక్స్ స్కాంలో రోజు రోజుకు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఇద్దరూ కలిసి హవాలా రాకెట్ నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరు అనేక బ్యాంకులలో ఖాతాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. జ్యోతిష్యం పేరుతో మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేయడం, ఆపై వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని తేనె, చింతగింజలను లక్షల రూపాయలకు అమ్మడం చేస్తూ వచ్చారు. ఈ స్కాంలో మహారాష్ట్రకు చెందిన పేరు పొందిన ప్రముఖులు, వ్యాపార, వాణిజ్య, సినీ రంగానికి, రాజకీయ రంగానికి చెందిన పలువురు అశోక్ ఖారత్ వలలో పడినట్లు సమాచారం. తాజాగా పోలీసుల దర్యాప్తులో విస్తు పోయే వాస్తవాలు వెలుగు చూశాయి.
జ్యోతిష్యం పేరుతో అశోక్ ఖారత్ అడ్డమైన పనులన్నీ చేశాడు. బ్లాక్ మెయిల్ చేయడం, డబ్బులు సంపాదించడం పనిగా పెట్టుకున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా తన పదవిని అడ్డం ఎట్టుకుని రూపాలీ చకాంకర్ కూడా అశోక్ ఖారత్ కు పూర్తి సహకారం అందించినట్లు తేలింది. విచారణలో ఏకంగా 300 నుంచి 400 మంది మహిళలను ట్రాప్ చేశాడు. ఆపై వీరితో సీక్రెట్ గా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల ద్వారా మహిళలతో తాను సన్నిహితంగా ఉన్న వీడియోలను చిత్రీకరించారు. వీటిని అడ్డం పెట్టుకుని వేధింపులకు గురి చేయడం, బ్లాక్ మెయిల్ చేయడంతో తన బండారం బయట పడింది. మొత్తంగా అశోక్ ఖారత్, రూపాలీ చకాంకర్ ల బ్యాంకు ఖాతాలు స్తంభించే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.
















