కేరళ : కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సీఎంను ఏకి పారేశారు. సీపీఐ, సీపీఎం పార్టీల లెఫ్ట్ ఫ్రంట్ కు ఓటు వేస్తే నరేంద్ర మోదీకి వేసినట్టే అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, నరేంద్ర మోదీకి నీడ లాంటి వాడు అని, వాళ్లిద్దరూ అన్నదమ్ముల లాంటివారు అని విచిత్ర కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
ఖమ్మం వెలుగుమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి ఇళ్లు కూల్చిన అంశం మీద ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు సీఎం పినరయి విజయన్. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రకంగా తన అక్కసును వెళ్లగక్కారు సీఎం రేవంత్ రెడ్డి. రెండు రోజుల కేరళ ప్రచారంలో భాగంగా ఇవాళ సీపీఐ, సీపీఎం లెఫ్ట్ ఫ్రంట్‌ను టార్గెట్ చేశారు. మరో వైపు సీపీఐతో తెలంగాణలో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం నడుపుతున్నామన్న విషయం మర్చి పోయి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
ఇదిలా ఉండగా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు సీఎం. తొలిసారిగా ట్రాన్స్ జెండర్స్ కు ఉద్యోగ అవకాశం కల్పించామన్నారు. అంతే కాకుండా ఏ రాష్ట్రంలో లేని విధంగా తల్లిదండ్రుల సంరక్షణ చట్టాన్ని తీసుకు వచ్చామన్నారు. ఇది దేశానికే ఆదర్శంగా మారిందన్నారు.















