విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు జర్నలిస్టులను ఉద్దేశించి.
మాది మీడియా ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. రాష్ట్రాభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని కోరారు. క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఏమవుతుందో గత ఐదేళ్లలో చూశాం అన్నారు. పాజిటివ్ న్యూస్ ఇవ్వమని కోరడం లేదని, కానీ. ప్రొగ్రెసివ్ న్యూస్ ఇవ్వాలని మీడియాను కోరుతున్నానని పేర్కొన్నారు. మంచిని, శాంతిని, అభివృద్ధిని ప్రమోట్ చేయాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మీడియానే ప్రపంచానికి తెలియ చేయాలని కోరారు. రాష్ట్రాభివృద్ధిలో మీడియా తగిన పాత్ర పోషించాలని అన్నారు. ఇవాళ అసెంబ్లీలో రాజధానిగా అమరావతికి చట్టబద్దత కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. వచ్చే ఐదేళ్లల్లో అమరావతిలో అద్భుతమైన అభివృద్ధిని చూస్తారని ప్రకటించారు.
అలాగే వివిధ రంగాల్లో ఏపీ అభివృద్ధి చెందుతోందని దాన్ని జర్నలిస్టులు అధ్యయనం చేసి విశ్లేషించాలని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే 2019-24 మధ్య కాలంలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. గత ఐదేళ్లల్లో జరిగిన వ్యవహరాన్ని మీడియా అంతా చూసిందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు అన్నారు. ఏది పడితే అది చేశారు. ఏది పడితే అది మాట్లాడారు. వీటిని కొన్ని సందర్భాల్లో మీడియా తప్పు పట్టింది. తాము చేసిన తప్పులను ఎత్తి చూపే మీడియాను కంట్రోల్ చేయడానికి నాటి ప్రభుత్వం జీవో నెంబర్ 2430 తెచ్చిందన్నారు. సోషల్ మీడియా ఇప్పుడు అతి పెద్ద సమస్యగా ఉందన్నారు.
















