Yash Dayal : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ యశ్ దయాల్ ఎట్టకేలకు మౌనం వీడాడు. తనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఓ మహిళ తనను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేసింది. దీంతో సదరు క్రికెటర్ పై కేసు నమోదైంది. ఘజియాబాద్ లో తనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.ఇదే సమయంలో తను మోసం చేస్తోందంటూ ఆరోపించాడు. తను క్రికెటర్ కావడంతో బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా ఈసారి జరిగిన ఐపీఎల్ మెగా టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారిగా టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ జట్టులో దయాల్ (Yash Dayal) కీ రోల్ పోషించాడు.
Yash Dayal Comments
ఇదే సమయంలో సదరు మహిళలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు క్రికెటర్. తనను మోసం చేసిందంటూ తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె తన నుండి వైద్య చికిత్స కోసం, షాపింగ్ కోసం అంటూ పెద్ద మొత్తంలో అప్పుగా డబ్బులు తీసుకుందని తెలిపాడు. ఈ విషయాన్ని తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు యష్ దయాల్. అయితే తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ బాధితురాలు వాపోయింది. పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా, క్రికెట్ వర్గాలలో కలకలం రేపింది.
అయితే పోలీసుల వర్షన్ మరో రకంగా ఉంది. యష్ దయాల్ కు తనకు మధ్య స్నేహం ఉందన్నారు. ఈ ఇద్దరూ 2021లో ఇన్ స్టా వేదికగా కలుసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత ఒకరినొకరు సంభాషించు కోవడం మొదలు పెట్టారని పేర్కొన్నారు. తన నుంచి లక్షలు తీసుకుంది. ఆ తర్వాత తిరిగి ఇస్తానని నమ్మించింది. చివరకు బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ వాపోయాడు యశ్ దయాల్.
Also Read : Trump Warning : బ్రిక్స్ లో భాగమైన భారత్ 10% అదనపు టారిఫ్ చెల్లించాల్సిందే


















